
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. ఏ పనైనా స్మార్ట్ ఫోన్ లో ఇట్టే పూర్తవుతోంది. ఫుడ్, ఎలక్ట్రానిక్స్, బట్టలు ఇతర వస్తువులను ఆన్ లైన్లో ఆర్డర్ చేయడం, ఏదైనా బ్యాంకింగ్ సేవలు పొందడం, ఇలా ఏ పనులైనా మొబైల్ ఫోన్ ద్వారా తేలిగ్గా జరిగిపోతున్నాయి. ఏదైనా సినిమా లేదా వీడియో చూడాలన్నా ఫోన్ దే కీలక పాత్ర. మరి అటువంటి ప్రాధాన్యత గల స్మార్ట్ ఫోన్ డిస్ప్లే ఎలా ఉండాలి చెప్పండి? నాణ్యతతో కూడిన పూర్తిస్థాయి హై డెఫినిషన్ డిస్ప్లే అయితే బహు బాగుంటుంది కదా.
అందుకే జనాలు ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఉన్న ఫోన్లను ఇష్టపడుతుంటారు. వీడియోలు చూసేందుకు, గేమ్స్ ఆడేందుకు ఫుల్ హెచ్డీ డిస్ప్లేలు బాగుంటాయి. ఈ ఫుల్ హెచ్డీ డిస్ప్లేలు 2400*1080 రెజుల్యూషన్ కలిగి ఉంటాయి. ఈ రెజుల్యూషన్ తో ఉన్న డిస్ప్లేలపై వీక్షణ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అలాగే మంచి అనుభూతిని అందిస్తుంది. అందుకోసమే మీకోసం ఈ ఆర్టికల్ లో రూ.12,000 ధర కలిగిన ఫుల్ హెచ్డీ డిస్ప్లే కలిగిన ఫోన్ల జాబితా అందిస్తున్నాం. ఓసారి చూడండి.
రూ.12,000 లోపు ధర కలిగిన ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఫోన్లు
- Motorola G32
- Motorola G52
- Samsung Galaxy F13
- Realme C55
- Vivo T1x
- Infinix Hot 30
- Motorola G31
- POCO M5
- Tecno Pova 3
- Tecno Spark 9T
- Samsung Galaxy M13
1. మోటోరోలా జీ32 (Motorola G32)
ఈ మోటోరోలా ఫోన్ ఖరీదు రూ.11,999 గా ఉంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంది.
2. మోటోరోలా జీ52 (Motorola G52)
మోటోరోలా జీ52 డివైజ్ 4జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. 64జిబి స్టోరేజీ ఈ ఫోన్ ద్వారా లభిస్తుంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడారు. 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే ఈ ఫోన్ లో ఉన్నాయి.
3. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13)
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 డివైజ్ 4జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64జిబి స్టోరేజీ, 50ఎంపి + 5ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.
4. రియల్మీ సీ55 (Realme C55)
ఈ ఫోన్ ధర రూ.10,999 గా ఉంది. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64ఎంపి + 2ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
5. వివో టీ1ఎక్స్ (Vivo T1X)
వివో టీ1ఎక్స్ స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంది. ఈ ఫోన్ లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి + 2ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.
6. ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ (Infinix Hot 20)
ఇన్ఫినిక్స్ హాట్ 20 5జీ ఫోన్ ధర రూ.11,499 గా ఉంది. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి + ఏఐ లెన్స్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 64జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.
7. మోటోరోలా జీ31 (Motorola G31)
మోటోరోలా జీ31 డివైజ్ ధర రూ.9,499 గా ఉంది. ఈ ఫోన్ లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 13ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.
8. పోకో ఎమ్5 (POCO M5)
పోకో ఎమ్5 స్మార్ట్ ఫోన్ ధర రూ.10,999 గా ఉంది. ఈ ఫోన్ లో 6.58-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, 50ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.
9. టెక్నో పోవా 3 (Tecno Pova 3)
టెక్నో పోవా 3 స్మార్ట్ ఫోన్ ధర రూ.10,997 గా ఉంది. ఈ ఫోన్ లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.
10. టెక్నో స్పార్క్ 9టీ (Tecno Spark 9T)
ఈ ఫోన్ ధర రూ.9,599 గా ఉంది. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి + 2ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.
11. శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 (Samsung Galaxy M13)
శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. ఈ ఫోన్ లో 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, 50ఎంపి + 5ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.