హైలైట్స్
- మలయాళ హిట్ లూసిఫర్ కి రీమేక్ గా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా
- ప్రధాన పాత్రలు పోషించిన చిరంజీవి, నయనతార, సత్యదేవ్, కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్
- నవంబర్ 19 న Netflix లో ప్రసారం కానున్న Godfather మూవీ
నవంబర్ నెలలో ఎన్నో దక్షిణాది సినిమాలు ఓటీటీ లో విడుదలయ్యాయి. మొన్నీమధ్యే కింగ్ నాగార్జున తన రీసెంట్ సినిమా ఘోస్ట్ ని ఓటీటీ స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ సినిమా గాడ్‌ఫాదర్ ని ఓటీటీ ప్రీమియర్ కి సిద్ధం చేశారు. థియేటర్లలో మెగా అభిమానులకు వినోదాన్ని పంచిన గాడ్‌ఫాదర్ ఓటీటీ ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అయ్యింది. తాజాగా ఈ చిత్రం ఓ దిగ్గజ ఓటీటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మరి గాడ్ ఫాదర్ ఓటీటీ ప్రీమియర్ తేదీ, స్ట్రీమింగ్ పార్ట్నర్ వివరాలు తెలుసుకుందాం పదండి.
Godfather ఓటీటీ విడుదల తేదీ
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో గాడ్ ఫాదర్ చిత్రం రూపొందింది. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. గాడ్‌ఫాదర్ చిత్రం నవంబర్ 19 న ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. మీరు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడకుంటే గనుక హ్యాపీగా మీ కుటుంబ సభ్యులతో కలిసి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ లో చూసేయండి.
చిరంజీవితో కలిసి నటించిన సల్మాన్ ఖాన్
మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రానికి తెలుగు రీమేక్ గా గాడ్‌ఫాదర్ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అక్టోబర్ 5 న థియేటర్లలో గాడ్‌ఫాదర్ చిత్రం విడుదలైంది. బిగ్ స్క్రీన్ పై ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ కోసం ముస్తాబై వచ్చేసింది. నవంబర్ 19 న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ లో ఈ చిత్రం ప్రీమియర్ అవుతుంది.
పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ గా గాడ్‌ఫాదర్ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్, ఊటీ, ముంబై ల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.
నటీనటుల ప్రదర్శన
ఈ చిత్రంలో సత్యదేవ్, నయనతార కీలక పాత్రల్లో కనిపించారు. చిరంజీవి, సత్యదేవ్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. థియేటర్లలో జనాలను అలరించిన గాడ్‌ఫాదర్ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. నవంబర్ 19 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో గాడ్‌ఫాదర్ చిత్రం ప్రసారం కానుంది. మీ కుటుంబంతో కలిసి మెగాస్టార్ నటించిన గాడ్‌ఫాదర్ చిత్రాన్ని వీక్షించండి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.