భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయబోతున్న తైవాన్ కంపెనీ Gogoro

హైలైట్స్

  • భారత ఎలక్ట్రిక్ వెహికిల్ మార్కెట్ లోకి అడుగుపెడుతోన్న తైవాన్ కంపెనీ Gogoro
  • త్వరలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్ళను లాంచ్ చేయనున్న Gogoro
  • బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ కోసం హీరో మోటోకార్ప్ తో చేతులు కలిపిన Gogoro

Gogoro Electric Scooter: భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగం రోజురోజుకీ వృద్ధి చెందుతోంది. దీంతో అంతర్జాతీయ కంపెనీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రంగంలోకి దిగుతున్నాయి. తాజాగా, తైవాన్ కి చెందిన వాహన తయారీదారు అయిన గొగొరొ సంస్థ త్వరలోనే భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. దేశీయ కంపెనీలు ఇప్పటికే కుప్పలుతెప్పలుగా ఈ-స్కూటర్లను మార్కెట్ లోకి వదులుతున్నాయి. వీటికి పోటి ఇచ్చేందుకు ఇప్పుడు Gogoro సంస్థ కూడా రేసులోకి దిగుతోంది. మరి గొగొరొ సంస్థ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Gogoro నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవేనా?

మీడియా రిపోర్ట్స్ గనుక నిజమైతే, Gogoro త్వరలోనే రెండు ఈ-స్కూటర్లను లాంచ్ చేయనుంది. అవి: Gogoro S1, Gogoro Viva. ఈ రెండు స్కూటర్లు భారత మార్కెట్ లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. త్వరలోనే Gogoro కంపెనీ తన ఎంట్రీకి సంబంధించిన అధికార ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Hero MotoCorp చేతులు కలిపిన Gogoro

ఆసక్తికర విషయం ఏంటంటే, Gogoro ఇప్పటికే Hero MotoCorp తో చేతులు కలిపింది. దేశంలో బ్యాటరీ-స్వాపింగ్ నెట్వర్క్ కోసం హీరో మోటోకార్ప్ తో కలిసి గొగొరొ పని చేయనుంది. అయితే, Gogoro యొక్క ఉద్దేశాలు ఏంటో ఇంకా తెలియలేదు. కమర్షియల్ సెక్టర్ లో తన ఈ-స్కూటర్లను ఇంట్రడ్యూస్ చేస్తుందా లేక ప్రైవేట్ సెగ్మెంట్ గా లాంచ్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

భారత్ లో Gogoro ఎలక్ట్రిక్ స్కూటర్లు

Gogoro S1 ఎలక్ట్రిక్ స్కూటర్ భారత ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో లాంచ్ అవుతుందని సమాచారం. అలాగే, డెలివరీ వెహికిల్ గా Gogoro Viva ఈ-స్కూటర్ ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. Gogoro S1 గురించి మాట్లాడితే ఇది ఇప్పటికే తైవాన్ లో అందుబాటులో ఉంది.

అందుచేత, Gogoro S1 యొక్క ఫీచర్లు తైవానీస్ మోడల్ నే పోలి ఉంటాయని అంచనా వేస్తున్నారు. Gogoro S1 లో 7.2 కిలోవాట్ మోటర్ ఉంటుంది. ఇది 27Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. Gogoro S1 0 నుంచి 50 కిలోమీటర్ల వేగం అందుకోవడానికి 3.7 సెకన్ల సమయం పడుతుంది. Gogoro S1 సింగిల్ చార్జ్ పై 150 కిలోమీటర్లు పరుగెడుతుంది.

అయితే Gogoro S1 లో హై-ఎండ్ ఇంజినీరింగ్ టెక్నిక్స్ వినియోగించడం చేత భారత్ లో ఈ స్కూటర్ ధర ఎక్కువగా ఉండనుంది. Gogoro S1 ఇప్పటికే భారత్ లో ఉన్న ఓలా ఎస్1, ఎస్1 ప్రో, బజాజ్ చెతక్, ఏథర్ 450ఎక్స్, బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 లతో పోటీ పడనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleత్వరలో Galaxy A14 4G ఫోన్ ని లాంచ్ చేయనున్న Samsung
Next articleభారత్ లో లాంచ్ అయిన Nokia G60 5G; ఫోన్ కొనుగోలుపై వైర్డ్ ఇయర్ బడ్స్ ఉచితం
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.