Home News భారత్ లో నేటి నుంచి Google Pixel 6a సేల్ ప్రారంభం, కొనచ్చంటారా?

భారత్ లో నేటి నుంచి Google Pixel 6a సేల్ ప్రారంభం, కొనచ్చంటారా?

హైలైట్స్:

గతవారం గూగుల్ పిక్సెల్ 6ఏ భారత్ లో లాంచ్ అయ్యింది. నేటి నుంచి ఈ ఫోన్ దేశంలో అమ్ముడు కానుంది. ఈ ఫోన్ సెల్ఫీ కోసం సెంటర్ పంచ్ హోల్ కటౌట్ తో వస్తోంది. అన్ని కార్నర్స్ లోనూ ఇమ్మెర్సివ్ వ్యూయింగ్ కోసం సిమ్మెట్రికల్ బెజెల్స్ ను అందించారు. బ్యాక్ ప్యానెల్ లో డ్యూయల్ కెమెరాలున్నాయి. కెమెరాలను అడ్డంగా ఉండే ఒక స్ట్రిప్ లో అమర్చారు. పిక్సెల్ 6 లో మాదిరిగా ఈ అమరిక ఉంది. భద్రత కొరకు ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అందించారు.

ఇప్పుడు ముఖ్యమైన ఫీచర్ల గురించి తెలుసుకుందాం. గూగుల్ సొంతంగా తయారు చేసిన టెన్సర్ చిప్ ను ఈ ఫోన్లో వాడారు. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, 128జిబి స్టోరేజీ వంటి కీలక ఫీచర్లున్నాయి.

భారత్ లో Google Pixel 6a ధర

భారత్ లో గూగుల్ పిక్సెల్ 6ఏ ధరను రూ.43,999 గా నిర్ణయించారు. ఇది సింగిల్ వేరియంట్ లోనే లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా ఫోన్ పై రూ.4000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ రూ.39,999 ధరకు లభించనుంది. చాక్ మరియు చార్కోల్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా కస్టమర్లు గూగుల్ పిక్సెల్ 6ఏ ను కొనుగోలు చేయవచ్చు.

Google Pixel 6a ను కొనచ్చంటారా?

తొలిసారిగా గూగుల్ పిక్సెల్ 6ఏ అమ్మకానికి వచ్చింది. అయితే ఇక్కడ ఎదురవుతోన్న ప్రశ్నేంటంటే, మీరు ఈ ఫోన్ కొనచ్చంటారా? చెప్పాలంటే, అవును మరియ కాదని సమాధానం వస్తుంది. మీరు కనుక గూగుల్ స్టాక్ ఆండ్రాయిడ్ ను ఇష్టపడే వ్యక్తి అయితే, అలాగే టైమ్ కి అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్ వంటివి రావాలనుకుంటే, మీరు ఈ ఫోన్ ని కొనవచ్చు. క్లీన్ సాఫ్ట్ వేర్ ఇచ్చిన అనుభూతి ఏదీ ఇవ్వలేదు. ఎటువంటి యాడ్స్ ఉండవు. ఎన్నో సాఫ్ట్ వేర్ ఫీచర్లు మీ యూజర్ ఎక్స్ పీరియన్స్ ని మరింత బెటర్ చేస్తాయి.

అయితే, ఈ ఫోన్ కి మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ప్రధానంగా పిక్సెల్ 6ఏ లో ధర చూసి కస్టమర్లు బెంబేలెత్తడం సహజం. ఎందుకంటే ఫోన్ ధర రూ.35,000 మార్క్ ని దాటింది. ఫోన్ ని ట్రై చేయమని చెప్పొచ్చు. కానీ, రూ.43,999 ధరలో దీని కంటే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ని డబ్బులు పెట్టి, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఫోన్ ని ఎవ్వరూ కొనాలని అనుకోరు. పైగా ఈ ఫోన్ లో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ పెద్ద మైనస్ గా కనిపిస్తోంది. పిక్సెల్ ఫోన్స్ లో కెమెరాలు అద్భుతంగా పెర్ఫామ్ చేయగలవు. అయితే, పోటీ పెరుగుతోన్న తరుణంలో ఇతర ఫోన్ కెమెరాలు కూడా దాదాపు సమానమైన రిజల్ట్స్ ని రాబడుతున్నాయన్నది వాస్తవం. మరి గూగుల్ పిక్సెల్ 6ఏ కి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. రియల్ మీ జీటీ2, ఐకూ 9, నథింగ్ ఫోన్ (1), వన్ ప్లస్ 10ఆర్ ఫోన్లు పిక్సెల్ 6ఏ కి ఉత్తమమైన ఆల్టర్నేటివ్స్ గా చెప్పవచ్చు.

Google Pixel 6a స్పెసిఫికేషన్స్

6.1 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే విత్ నౌ ప్లేయింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, టెన్సర్ చిప్సెట్, 6జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 12.2 ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 8ఎంపి సెల్ఫీ కెమెరా, 5జీ, 4జీ వోల్టీ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.2 ఎల్ఈ, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 4306ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, అండర్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, టైటర్ ఎమ్2 సెక్యూరిటీ చిప్, డ్యూయల్ మైక్రోఫోన్స్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.