హైలైట్స్:
- జులై 21 న లాంచ్ కానున్న గూగుల్ పిక్సెల్ 6ఏ
- అయితే గూగుల్ నుంచి రావాల్సిన అధికార ప్రకటన
- గూగుల్ కంపెనీ యొక్క ఐ/ఓ 2022 డెవలపర్స్ సదస్సులో లాంచ్ అయిన పిక్సెల్ 6ఏ
గూగుల్ కంపెనీ యొక్క ఐ/ఓ 2022 డెవలపర్స్ సదస్సులో గూగుల్ పిక్సెల్ 6ఏ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో పిక్సెల్ 6ఏ భారత్ లో లాంచ్ అవుతుందని గూగుల్ తెలియజేసింది. కానీ, కచ్చితమైన టైమ్ లైన్ చెప్పలేదు. అయితే గత కొన్ని రోజులుగా పిక్సెల్ 6ఏ ధరకు సంబంధించిన పలు రూమర్లు వినిపిచండంతో పాటు, కొన్ని రిపోర్ట్స్ కూడా వెలుగు చూశాయి. ఇవన్నింటినీ బట్టి చూస్తే, ఫోన్ లాంచ్ కి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందని అర్థమవుతోంది.
తాజాగా సహిక్ కరౌల్ అనే ఒక ట్విట్టర్ యూజర్ గూగుల్ పిక్సెల్ 6ఏ జులై 21 న అంటే రేపు భారత్ లో లాంచ్ అవుతోందని ట్వీట్ చేశాడు. ఎటువంటి హడావుడి లేకుండా మెల్లగా డివైజ్ ని లాంచ్ చేసే అవకాశాలున్నాయి. మరికొన్ని గంటల్లో మనకు మరిన్ని వివరాలు తెలియబోతున్నాయి.
భారత్ లో Google Pixel 6a ధర (అంచనా)
టిప్ స్టర్ సహిల్ కరౌల్ చెబుతున్న దాన్ని బట్టి, గూగుల్ పిక్సెల్ 6ఏ బాక్స్ ధర రూ.43,999 గా ఉంటుందని సమాచారం. ఇక భారత్ లో ఫోన్ ధర రూ.37,000 ఉంటుందని తెలుస్తోంది. ఇక యూఎస్ లో ఫోన్ ధర 449 డాలర్లు (దాదాపు రూ.35,000) గా ఉంది.
Google Pixel 6a స్పెసిఫికేషన్స్
గూగుల్ పిక్సెల్ 6ఏ 6.1 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉండనుంది. ఇంకా ఈ ఫోన్లో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియో, హెచ్డీఆర్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3, టెన్సర్ చిప్సెట్, 6జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి.
ఇప్పుడు బ్యాటరీ విభాగం వివరాలు చూద్దాం. పిక్సెల్ 6ఏ లో 4306ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను అందించారు. అలాగే ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్, టైటాన్ ఎమ్ 2 సెక్యూరిటీ చిప్, డ్యూయల్ మైక్రో ఫోన్స్, నాయిస్ ఇంప్రెషన్స్ వంటి ఫీచర్లున్నాయి. ఇప్పుడు కనెక్టివిటీ ఫీచర్లను గురించి చూద్దాం. పిక్సెల్ 6ఏ లో 5జీ, 4జీ వోల్టీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2 ఎల్ఈ, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇప్పుడు కెమెరా విభాగం వివరాలు తెలుసుకుందాం. పిక్సెల్ 6ఏ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 12.2 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. మరి ఫోన్ కి సంబంధించి గూగుల్ నుంచి అధికార ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.











