Home News లాంచ్ కి ముందు లీకైన Google Pixel 7, Pixel 7 Pro ధరలు

లాంచ్ కి ముందు లీకైన Google Pixel 7, Pixel 7 Pro ధరలు

హైలైట్స్:

అక్టోబర్ 6 న జరగనున్న గూగుల్ స్పెషల్ హార్డ్‌వేర్ ఈవెంట్ లో Google Pixel 7, Pixel 7 Pro ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాము సెకండ్ జనరేషన్ టెన్సర్ చిప్ తో రానున్నట్లు కంపెనీ ఇది వరకే వెల్లడించింది. అలాగే, ఫ్లిప్ కార్ట్ టీజర్ ద్వారా పిక్సెల్ 7 సిరీస్ ఇండియాలో కూడా లాంచ్ కానుందని స్పష్టమైంది. నేడు, పిక్సెల్ 7 సిరీస్ ధరలు లీక్ అయ్యాయి. గతేడాది వచ్చిన పిక్సెల్ ఫోన్ ధరల మాదిరే 7 సిరీస్ ధరలు ఉన్నాయి.

ఫేస్బుక్ లో గూగుల్-పోస్టెడ్ రెండర్ ఇమేజ్ ప్రత్యక్షమవ్వడంతో పిక్సెల్ 7 ప్రో డిజైన్ ని మేం చూడటం జరిగింది. పిక్సెల్ 6 ప్రో తో పోల్చితే 7 ప్రో లో కర్వ్డ్ ఎడ్జెస్ ని కాస్త క్రిందకు టోన్ చేసినట్లు తెలుస్తోంది.

Google Pixel 7 Pro ఫ్రంట్ డిజైన్

Google Pixel 7 Pro ఫ్రంట్ డిజైన్ గూగుల్-పోస్టెడ్ రెండర్ ఇమేజ్ ద్వారా బయటకు రివీల్ అయ్యింది. ఈ ఫోన్లో సెంటర్ పంచ్ హోల్ కటౌట్, సిమెట్రికల్ బెజెల్స్, కర్వ్డ్ ఎడ్జెస్ ఉన్నాయి. అలాగే బ్యాక్ ప్యానెల్ పై హారిజంటల్ స్ట్రైప్ లో ట్రిపుల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఫోన్ చూడటానికి హెజెల్ కలర్ లో కనిపిస్తోంది. అయితే లాంచ్ రోజున ఇతర కలర్ ఆప్షన్స్ కూడా రివీల్ అయ్యే అవకాశం ఉంది.

ఇమేజ్ లో, రెండు పిక్సెల్ వాచెస్, పిక్సెల్ బడ్స్ ప్రో కూడా కనిపిస్తున్నాయి. పిక్సెల్ 7 ప్రో బ్యాక్ ప్యానెల్ హెజెల్ కలర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మూతబడిన ఫేస్బుక్ గ్రూప్ లో ఆ ఇమేజ్ పోస్ట్ కావడం వల్లన ఇప్పుడు ఆ ఇమేజ్ జనాలకు అందుబాటులో లేదు.

Google Pixel 7, Pixel 7 Pro ధరలు

ఆర్టెమ్ రుసాకోవ్స్కీ అనే టిప్ స్టర్ ద్వారా Google Pixel 7, Pixel 7 Pro ధరలు రివీల్ అయ్యాయి. పిక్సెల్ 7 సిరీస్ ధరలు, దాదాపుగా పిక్సెల్ 6 సిరీస్ ధరల మాదిరే ఉంటాయని అర్థమవుతోంది. పిక్సెల్ 7 ధర 599 డాలర్లు (దాదాపు రూ.48,500) కాగా, పిక్సెల్ 7 ప్రో ధర 899 డాలర్లు (దాదాపు రూ.72,000) గా ఉంది. పిక్సెల్ 7 ఫోన్ స్నో, అబ్సిడియన్, లెమన్ గ్రాస్ కలర్ ఆప్షన్స్ లో లభించనుండగా, పిక్సెల్ 7 ప్రో అబ్సిడియన్, హెజెల్, స్నో కలర్ ఆప్షన్స్ లో లభ్యమవుతుంది.

అక్టోబర్ 6 నుంచి Google Pixel 7, Pixel 7 Pro ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని లీక్ ద్వారా తెలుస్తోంది. అంటే లాంచ్ అయిన కాసేపటికి ఈ ఫోన్లు ప్రీ-ఆర్డర్ కి అందుబాటులోకి వస్తాయన్నమాట. ప్రస్తుతానికి సేల్ డేట్ అక్టోబర్ 13 అని లిస్ట్ కాబడింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.