Geekbench పై కనిపించిన Google Pixel 7 Pro

హైలైట్స్:

  • బెంచ్ మార్కింగ్ లిస్టింగ్ లో కనిపించిన Google Pixel 7 Pro
  • Google Pixel 7 Pro ఫోన్ పెర్ఫామెన్స్ ఎలా ఉందో తెలిపిన లిస్టింగ్
  • గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసిన Google Pixel 7 Pro స్పెసిఫికేషన్స్

అక్టోబర్ 6 న మేడ్ బై గూగుల్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్లో గూగుల్ కంపెనీ Google Pixel 7 సిరీస్ తో పాటు Google Pixel Watch ని లాంచ్ చేయనుంది. ఈవెంట్ కి ముందు, Google Pixel 7 Pro బెంచ్ మార్క్ లిస్టింగ్ పై కనిపించింది. దీని ద్వారా ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కొన్ని బయటకు వచ్చాయి.

గీక్ బెంచ్ లిస్టింగ్ ని తొలుత ప్రముఖ టిప్ స్టర్ అభిషేక్ యాదవ్ గమనించాడు. ఇక Google Pixel 7 Pro సింగిల్-కోర్ టెస్ట్ లో 1068 పాయింట్లు, మల్టీ-స్కోర్ టెస్ట్ లో 3149 పాయింట్లు సాధించింది. ఈ లిస్టింగ్ ద్వారా Google Pixel 7 Pro యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ తెలిశాయి. ర్యామ్, ప్రాసెసర్, మదర్ బోర్డ్ తదితర వివరాలు బయటకు వచ్చాయి.

Google Pixel 7 Pro ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో రానుందని Geekbench జాబితా ద్వారా తెలుస్తోంది. అలాగే 1.8 గిగాహెర్ట్జ్ కలిగిన ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇందులో ఉండనుంది. కచ్చితంగా ఏ ప్రాసెసర్ తో Google Pixel 7 Pro వస్తుందో గీక్ బెంచ్ లిస్టింగ్ వెల్లడించలేదు. కానీ, టిప్ స్టర్ చెబుతున్న దాన్ని బట్టి, Google Pixel 7 Pro ఫోన్ Google Tensor G2 చిప్సెట్ తో వస్తుందని సమాచారం. అలాగే ఇందులో 12జిబి ర్యామ్ ఉంటుందని సదరు టిప్ స్టర్ తెలిపాడు.

బెంచ్ మార్క్ లిస్టింగ్ లో Google Pixel 7 Pro ఫోన్ మదర్ బోర్డ్ చీతా అనే పేరుతో కనిపించింది. Google Pixel 7 Pro లో మాలి-జీ710 జీపీయూ ఉండనుంది.

Google Pixel 7 Pro నుంచి ఏమి ఆశించవచ్చు

పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో ఫోన్లతో పాటు, గూగుల్ పిక్సెల్ వాచ్ ని అక్టోబర్ 6 న జరిగే మేడ్ బై గూగుల్ ఈవెంట్ సందర్భంగా లాంచ్ చేయనున్నట్లు గూగుల్ ఇదివరకే ప్రకటించింది. రానున్న ఈవెంట్లకు సంబంధించిన వివరాలతో గూగుల్ తన వెబ్ సైట్ ని అప్డేట్ చేసింది.

అప్డేట్ చేయబడిన Pixel 7 యొక్క మేగజీన్ పేజీ ఆధారంగా, Tensor G2 చిప్సెట్ తో పిక్సెల్ 7 రానుందని స్పష్టమైంది. Pixel 7a, పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్లలో టెన్సర్ జీ2 చిప్ ఉండనుంది. టెన్సర్ జీ2 చిప్ ఫోటోలు, వీడియోలు, సెక్యూరిటీ, స్పీచ్ రికగ్నిషన్ విషయంలో పర్సనలైజ్డ్ ఫీచర్లను అందిస్తుందని Google తెలిపింది.

Tensor G2 చిప్ గురించి తెలుసుకుందాం. ఈ చిప్ 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ ని గూగుల్ కోసం శాంసంగ్ తయారు చేస్తోంది. మల్టీ కోర్ పెర్ఫామెన్స్ లో 10 శాతం ఇంప్రూవ్మెంట్ కనిపించనుంది. ఇక గ్రాఫిక్స్ కోసం టెన్సర్ జీ2 చిప్, Mali-G78 MP20 GPU ని ఉపయోగించుకోనుంది. డైమెన్సిటీ 9000+ చిప్ లో కూడా ఇదే జీపీయూని వాడటం జరిగింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, టెక్నాలజీ, ఆటోమొబైల్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous articleలీకైన Vivo X90 Pro లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్
Next articleJio 5G లాంచ్ కి ముందు లాభపడిన అంబాని కంపెనీ, వెనుకంజలో Airtel, Vi
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.