గూగుల్ ఐ/ఓ 2023 ఈవెంట్ లో Google Pixel 7a డివైజ్ భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచైంది. ఈ హ్యాండ్సెట్ గతేడాది వచ్చిన Google Pixel 6a కి సక్సెసర్ గా మార్కెట్ లోకి వచ్చింది. ఈసారి Google Pixel 7a లో టెన్సర్ జీ2 చిప్ ని అందించారు. ఇదే మేజర్ అప్‌గ్రేడ్ అని చెప్పవచ్చు. ఇదే చిప్సెట్ ని పిక్సెట్ 7 ప్రో లో కూడా వాడారు. అంతేకాదు, భారత్ లో గూగుల్ సంస్థ 28 మల్టీబ్రాండ్ స్టోర్లను 27 నగరాల్లో ప్రారంభించింది. పిక్సెల్ ఫోన్ వినియోగదారులు ఈ స్టోర్లకు వెళ్ళి సేవలను పొందవచ్చు. 64ఎంపి కెమెరా, 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో Pixel 7a లాంచైంది.
సరే, ఓసారి Google Pixel 7a డివైజ్ ధర, లభ్యత, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్ లో Google Pixel 7a ధర, లభ్యత
- భారత్ లో Google Pixel 7a 8జిబి + 128జిబి మోడల్ ధర రూ.43,999 గా ఉంది. ఈ ఫోన్ చార్కోల్, సీ, స్నో కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- ఫ్లిప్ కార్ట్ ద్వారా మే 11 నుంచి అనగా గురువారం నుంచి ఈ హ్యాండ్సెట్ సేల్స్ మొదలవుతాయి.
- హెచ్డీఎఫ్సీ కార్డ్స్ లేదా పిక్సెల్ మరియు ఏదైనా ఎంపిక చేయబడిన స్మార్ట్ ఫోన్లను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ.4,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో Google Pixel 7a డివైజ్ ని రూ.39,999 కే సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.
- ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లు, పిక్సెల్ బడ్స్ ఏ-సిరీస్ లేదా ఫిట్‌బిట్ ఇన్స్పైర్ 2 ని రూ.3,999 కే సొంతం చేసుకోవచ్చు.
- ఇంకా ఫోన్ కొనుగోలుపై గూగుల్ సంస్థ 3 నెలల పాటు యూట్యూబ్ ప్రీమియమ్ మరియు కొత్త యూజర్లకు గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్‌ని అందిస్తోంది.
Google Pixel 7a స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- 6.1-ఇంచ్ ఫుల్హెచ్డీ+
- 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
Google Pixel 7a లో 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఒక పంచ్-హోల్ కటౌట్, 429 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, ఆల్వేస్-ఆన్-డిస్ప్లే, ఎట్ ఏ గ్లాన్స్ అండ్ నౌ ప్లేయింగ్, హెచ్డీఆర్, హై-బ్రైట్నెస్ మోడ్ వంటివి ఉన్నాయి.
ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజీ
- టెన్సర్ జీ2
- ఎల్పీడీడీఆర్5
- యూఎఫ్ఎస్ 3.1
Google Pixel 7a లో 8జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
ఓఎస్, బ్యాటరీ
- ఆండ్రాయిడ్ 13 ఓఎస్
- 4300 ఎంఏహెచ్
Google Pixel 7a డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. కంపెనీ 5 ఏళ్ళ పాటు అప్డేట్స్ ఇస్తామని హామీ ఇస్తోంది. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 4300 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో పాటు క్యూఐ వైర్లెస్ చార్జింగ్ ఫెసిలీటీ కూడా ఉంది.
కెమెరా విభాగం
- 64ఎంపి ప్రైమరీ
- 13ఎంపి సెల్ఫీ
Google Pixel 7a స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
కెమెరా ఫీచర్లు
- ఫోటో అన్‌బ్లర్
- మ్యాజిక్ ఎరేజర్
- నైట్ సైట్
Google Pixel 7a స్మార్ట్ ఫోన్ లో ఫోటో అన్‌బ్లర్, మ్యాజిక్ ఎరేజర్, నైట్ సైట్, లాంగ్ ఎక్స్‌పోజర్, రియల్ టోన్, ఫేస్ అన్‌బ్లర్, పనొరమ, మాన్యువల్ వైట్ బ్యాలెన్సింగ్, టాప్ షాట్, పొట్రెయిట్ మోడ్, సూపర్ రెజ్ జూమ్ తదితర ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
కనెక్టివిటీ
- 5జీ
- ఎన్ఎఫ్‌సీ
Google Pixel 7a లో 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఉన్నాయి.
Google Pixel 7a స్మార్ట్ ఫోన్ 9 మిల్లీ మీటర్ల మందం, 152 మిల్లీ మీటర్ల పొడవు, 72.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 193.5 గ్రాముల బరువు ఉంటుంది.
భద్రత కోసం Google Pixel 7a లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. స్టీరియో స్పీకర్లు, 2మైక్రోఫోన్లు, ఐపీ67 రేటింగ్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
