కొన్ని రోజుల క్రితం Google Pixel 9 Pro యొక్క 5కే క్యాడ్ రెండర్స్, 360 డిగ్రీ వీడియో లీక్ అయ్యాయి. రెండర్స్ ద్వారా డైమెన్షన్స్, డిజైన్, డిస్ప్లే సైజ్ గురించి తెలిసాయి. తర్వాత గూగుల్ పిక్సెల్ 8ఏ రిటైల్ బాక్స్ ఇమేజెస్ కూడా లీక్ అయ్యాయి. ఇప్పుడు, టిప్‌స్టర్ OnLeaks సౌజన్యంతో 91మొబైల్స్ Google Pixel 9 యొక్క 5కే రెండర్స్ మరియు 360 డిగ్రీ వీడియోని లీక్ చేసింది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Google Pixel 9 5కే CAD రెండర్స్
![]()
- Google Pixel 9 5కే క్యాడ్ రెండర్స్ చూస్తే ప్రో వేరియంట్ మాదిరే ఉన్నాయి. రౌండెడ్ కార్నర్స్, ఫ్లాట్ ఎడ్జెస్ తో Google Pixel 9 కనిపిస్తోంది. కెమెరా ఐల్యాండ్ కి కాస్త మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కెమెరా ఐల్యాండ్ గత మోడల్స్ మాదిరిగా ఒక చివరలో మొదలై మరొక చివర వరకు లేదు.
- Google Pixel 9 డివైజ్ టెలీఫోటో సెన్సర్ తో వస్తుండటం గమనించదగిన మార్పు అని చెప్పవచ్చు. దీంతో మూడో సెన్సర్ కి చోటు కల్పించినట్లైంది.
- Google Pixel 9 ప్రో వేరియంట్ లో ఎలాగైతే ఉందో అదే విధంగా Google Pixel 9 లో టెలీఫోటో సెన్సర్ కనిపిస్తోంది.
- Google Pixel 9 లోని ట్రిపుల్ కెమెరా సెటప్ లోని సెన్సర్స్ యొక్క కచ్చితమైన వివరాలు ఇంకా తెలియదు.
- కెమెరా మాడ్యూల్ లో ఒక ఎల్ఈడీ ఫ్లాష్ తో పాటు, మరొక సెన్సర్ ఉంది. ఇది టెంపరేచర్ సెన్సర్ అని భావిస్తున్నారు.
- Google Pixel 9 లో 6.1-ఇంచ్ ఫ్లాట్ ఓఎల్ఈడీ ప్యానెల్, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉంటాయని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.











