ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Google నుంచి త్వరలో Pixel 9 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో 4 మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా పిక్సెల్ 9 సిరీస్ లోని 3 స్మార్ట్‌ఫోన్ల యొక్క లైవ్ ఇమేజెస్ లీక్ అయ్యాయి. దీంతో డివైజెస్ డిజైన్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. ఓసారి గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్ల యొక్క డిజైన్ వివరాలు తెలుసుకుందాం పదండి.
Google Pixel 9 సిరీస్ లైవ్ ఇమేజెస్ (లీక్)
జర్మనీకి చెందిన వెబ్‌సైట్ Rozetked ద్వారా Google Pixel 9 సిరీస్ యొక్క లైవ్ ఇమేజెస్ రివీల్ అయ్యాయి.
లీక్ లో 3 మోడల్స్ కనిపిస్తున్నాయి. అయితే లాంచ్ సమయంలో ఈ సిరీస్ నుంచి 4 మోడల్స్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. Pixel 9, Pixel 9 Pro, Pixel 9 XL మరియు Pixel 9 Pro XL ఫోన్లు లాంచ్ అవుతాయని సమాచారం.
Google Pixel 9 మెటల్ ఫ్రేమ్ మరియు గ్లాస్ బ్యాక్ తో ఉన్నట్లు ఇమేజ్ ని గమనిస్తే తెలుస్తోంది.
Google Pixel 9 Pro గురించి మాట్లాడితే, ఈ డివైజ్ మ్యాట్ ఫినిష్ తో వస్తున్నట్లు సమాచారం.
రెండు ఫోన్ల యొక్క ఇమేజెస్‌ని గమనిస్తే, ప్రో వేరియంట్ లో 3 కెమెరాలు, స్టాండర్డ్ వేరియంట్ లో రెండు కెమెరాలు ఉన్నట్లు అర్థమవుతోంది.
లీక్ ద్వారా బయటకు వచ్చిన ఇమేజెస్‌ని పరిశీలిస్తే, డివైజెస్ ఫ్రంట్ లుక్ రివీల్ కాలేదని స్పష్టమవుతోంది. అయితే పిక్సెల్ 9 డిస్ప్లేలో పిక్సెల్ 9 ప్రో తో పోల్చితే, బెజెల్స్ మందంగా ఉంటాయని అంచనా వేయవచ్చు.
