Home News Google Pixel Mini పై పని చేస్తున్న గూగుల్

Google Pixel Mini పై పని చేస్తున్న గూగుల్

హైలైట్స్:

అక్టోబర్ 6 న ‘Made by Google’ ఈవెంట్ నిర్వహించనున్నామని ఇటీవలె గూగుల్ ప్రకటించింది. ఈవెంట్ లో గూగుల్ తన అప్‌కమింగ్ సిరీస్ Google Pixel 7, Pixel Watch లను లాంచ్ చేయనుంది. అయితే గూగుల్ పిక్సెల్ మినీ పై కూడా గూగుల్ పని చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ టిప్‌స్టర్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం, గూగుల్ కంపెనీ, పిక్సెల్ మినీ వర్షన్ పై పని చేస్తున్నట్లు సమాచారం.

డిజిటల్ చాట్ స్టేషన్ నుంచి వచ్చిన రిపోర్ట్ ని బట్టి, గూగుల్ కంపెనీ చిన్న తెర కలిగిన ఫ్లాగ్షిప్ డివైజ్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. డిజైన్ విషయానికి వస్తే ఇదివరకు వచ్చిన పిక్సెల్ ఫోన్లను పోలి ఉంటుంది. సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లే, డ్యూయల్ టోన్ బ్యాక్ ప్యానెల్, కెమెరా వైజర్ ఉంటాయి.

అయితే, ఇది టిప్‌స్టర్ పిక్సెల్ మినీ పై ఇచ్చిన సమాచారం మాత్రమే. ఆపిల్ తన చిన్న తెర ఐఫోన్ మినీ మోడల్స్ ని నిలిపి వేసి ఐఫోన్ 14 ప్లస్ భారీ ఫోన్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, లేటెస్ట్ ఐఫోన్ 14 ప్లస్ బిగ్ ఫోన్ కంటే, గతేడాది వచ్చిన ఐఫోన్ 13 మినీ డివైజ్ బుకింగ్స్ అధికంగా ఉన్నాయి. ఈ తరుణంలో గూగుల్ మినీ ఫోన్ మ్యాటర్ బయటకు రావడం ఆసక్తికరం. మినీ ఫోన్ మార్కెట్ ని క్యాప్చర్ చేసేందుకు గూగుల్ డిసైడ్ అయినట్లు ఈ మినీ ఫోన్ ఆలోచనతో అర్థమవుతోంది. అయితే దీనిపై గూగుల్ నుంచి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

అక్టోబర్ 6 న జరగబోవు మేడ్ బై గూగుల్ ఈవెంట్ లో గూగుల్ పిక్సెల్ మినీ వర్షన్ కి సంబంధించి ఏ విషయం బయటకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈవెంట్ సందర్భంగా Google Pixel 7 సిరీస్ ను సదరు కంపెనీ లాంచ్ చేయనుంది. అలాగే గూగుల్ కంపెనీ తన తొలి స్మార్ట్‌వాచ్ Google Pixel Watch ని లాంచ్ చేయనుంది. దీంతో గూగుల్ ఫ్యాన్స్ ఈవెంట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటి వరకు గూగుల్ పిక్సెల్ సిరీస్ లో అతిచిన్న మోడల్ ఏదైనా ఉందంటే అది Google Pixel 6a మాత్రమే. Google Pixel 6a కొన్ని నెలల క్రితమే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. Google Pixel 6a 6.1-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, గూగుల్ టెన్సర్ చిప్సెట్, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 12ఎంపి ప్రైమరీ + 12ఎంపి వైడ్ యాంగిల్ డ్యూయల్ రియర్ కెమెరాస్ కలిగి ఉంది.

Google Pixel 6a లో 4410 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. భారత్ లో ఈ ఫోన్ ధరని గూగుల్ తగ్గించింది. అలాగే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా కొనేవారికి బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అన్ని కలుపుకుని Google Pixel 6a రూ.30 వేల లోపే లభిస్తోంది. కాబట్టి, ఇంట్రెస్ట్ ఉన్న వారు, ఈ సమయంలో Google Pixel 6a ని కొంటే చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.