హైలైట్స్:
- 2022, జులై 8 న థియేటర్లలో రిలీజ్ అయిన హ్యాపీ బర్త్ డే సినిమా
- చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన లావణ్యా త్రిపాఠి
- మత్తు వదలరా ఫేమ్ రితేశ్ రానా తెరకెక్కించిన హ్యాపీ బర్త్ డే
- చిత్ర ఓటీటీ హక్కులను కైవసం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సైట్ నెట్ ఫ్లిక్స్, ఆగస్టు 8 న చిత్రం ప్రీమియర్ అవుతుందని ప్రకటన
మత్తు వదలరా సినిమాతో బంపర్ హిట్ కొట్టిన దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రమే ఈ హ్యాపీ బర్త్ డే. కొత్తదనం కోరుకునే వారిలో ముందు వరుసలో ఉంటారు మన తెలుగు వారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక ప్రయోగాత్మక చిత్రాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. కమర్షియల్ సినిమాకు మరో మీనింగ్ గా స్థిరపడిన తెలుగు చిత్రసీమ, బాహుబలి వంటి సినిమాలతో ప్రపంచ స్థాయి సినిమాలను రూపొందించగలదని నిరూపించింది. ఇంక అంతే, అదే స్పూర్తితో వరుసబెట్టి ప్రయోగాత్మక చిత్రాలు వస్తూనే ఉన్నాయి.
వైవిధ్యానికి తెలుగు సినిమా అవకాశం వచ్చినప్పుడల్లా ఎర్ర తివాచీ పరుస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ వైవిధ్యం, వినోదం సగటు సినీ ప్రేక్షకుడుకి అర్దమవ్వడంతో పాటు అలరించగలగాలి. ఆ క్రమంలోనే వచ్చిన చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. తెలుగుకు కొత్త జోనర్ అయిన ‘సర్రియల్ హ్యూమర్’ తో ఈ సినిమా తెరకెక్కింది.
త్వరలోనే హ్యాపీ బర్త్ డే చిత్రం ఓటీటీ ద్వారా ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ ఈ చిత్ర ఓటీటీ హక్కులను కైవసం చేసుకుంది. 2022, ఆగస్టు 8 న చిత్రం ప్రీమియర్ అవుతుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు తప్పకుండా ఓటీటీ ద్వారా చూడండి.
చిత్ర తారాగణం:
లావణ్య త్రిపాఠి, నరేశ్ అగస్త్య, వెన్నెల కిశోర్, సత్య, తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టెయిన్మెంట్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.
చిత్ర కథ:
రక్షణ శాఖ మంత్రి రిత్విక్ సోధీ (వెన్నెల కిషోర్) ఇంటికో గన్ తెస్తాడు. ఇదే అదునుగా దేశంలో అందరూ గన్స్ ని కొనుక్కొని తిరగాలనుకుంటారు. ఎక్కడ చూసినా ఈ గన్స్ గోలే. బహిరంగ మార్కెట్ లో గన్స్ దొరకడం సాధారణ విషయం అయిపోతుంది. క్యాజువల్ గా షాప్ కు వెళ్లి జనం కొనుక్కుంటారు. ఇదిలా ఉంటే పసుపులేటి హ్యాపీ త్రిపాఠీ (లావణ్యా త్రిపాఠీ), తన ఫ్రెండ్ సర్‌ప్రైజ్ బర్త్ డే పార్టీ ప్లాన్ చేశానంటే రిట్జ్ గ్రాండ్ హోటల్‌కు వెళుతుంది. పార్టీ విసుగ్గా, చిరాగ్గా ఉండటంతో సేమ్ హోటల్‌లో ఉన్న పోష్ పబ్‌కు వెళుతుంది. హ్యాపీ ఆర్డర్ చేసిన డ్రింక్ లో మత్తు మందు కలవడం, ఆమెను వెయిటర్ కిడ్నాప్ చేయడం జరిగిపోతాయి. ఆ తర్వాత ఏం జరగనుందన్నదే ఈ చిత్ర కథ.
ఆగస్టు 8 న నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న ఈ హిలేరియస్ మూవీని చూసి ఆనందించండి.