Hisense కంపెనీ ఇటీవలి కాలంలో తన స్మార్ట్ టీవీ లతో హడావుడి చేస్తోంది. జనాలు ఈ కంపెనీ టీవీల పట్ల ఆకర్షితులవుతున్నాయి. తాజాగా ఈ సంస్థ మార్కెట్ లోకి తన కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది. నాలుగు 4కే స్మార్ట్ టీవీలు భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అవి: Laser TV, E7K Pro, Tornado A7K, A6K. లేజర్ టీవీ ప్రత్యేకత ఏంటంటే, ఈ టీవీ కొనుగోలుదారులు 120 ఆంబియెంట్ లైట్ రిజెక్షన్ టెక్నాలజీ కలిగిన స్క్రీన్ ని పొందుతారు. సరే, ఓసారి ఈ టీవీల ధరలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ధర, లభ్యత
Hisense సంస్థ లేజర్ టీవీని రూ.499,999 ధరతో లాంచ్ చేసింది. అమెజాన్ పై 3 ఏళ్ళ పాటు నిరవధిక వ్యారంటీని కంపెనీ అందిస్తోంది. ఈ వ్యారంటీ మొదటి 7 రోజుల్లో టీవీని కొనుగోలు చేస్తేనే వర్తిస్తుంది.
- ఇక టోర్నడో క్యూఎల్ఈడీ ఈ7కే టీవీ ధర రూ.49,999 గా ఉంది.
- టోర్నడో ఏ7కే ధర రూ.47,999 నుంచి ప్రారంభమవుతుంది.
- మరోవైపు ఏ6కే టీవీ ధర రూ.28,999 తో మొదలవుతుంది.
- లేజర్ టీవీ, ఈ7కే ప్రో టీవీలు ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ పై జులై 15 న సేల్ కి వస్తున్నాయి. ఇక ఏ7కే టీవీ అదే తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో సేల్ కి అందుబాటులో ఉంటుంది. ఏ6కే టీవీ ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ వెబ్ సైట్స్ పై సేల్ కి వస్తోంది.
Hisense Laser TV ఫీచర్లు
- డిస్ప్లే: Hisense Laser TV లో 120-ఇంచ్ స్క్రీన్, ఆర్జీబీ ట్రిపుల్ కలర్ లేజర్ లైట్ సోర్స్, ఏఎల్ఆర్ స్క్రీన్ ఉన్నాయి. ఈ టీవీలో 3840*2160 పిక్సెల్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 లుమెన్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ర్యామ్: Hisense Laser TV లో 8జిబి స్టోరేజీ, 3జిబి ర్యామ్ ఉన్నాయి.
- కనెక్టివిటీ: Hisense Laser TV లో హెచ్డీఎంఐ, యూఎస్బీ, బ్లూటూత్, 40 వాట్ స్టీరియో స్పీకర్స్, డాల్బి ఆడియో, డాల్బీ అట్మాస్ ఉన్నాయి.
- ఓఎస్: Hisense Laser TV VIDAA U6 అనే ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.
Hisense Tornado QLED E7K Pro TV
Hisense Tornado QLED E7K Pro TV బెజెల్-లెస్ డిస్ప్లే డిజైన్ తో వచ్చింది. ఈ టీవీ లో 55-ఇంచ్ 4కే అల్ట్రా హెచ్డీ డిస్ప్లే, 3840*2160 పిక్సెల్స్ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. హెచ్డీఆర్ గేమ్ మోడ్ కూడా ఉంది. ఈ టీవీలో ఏఎండీ ఫ్రీసింక్ ప్రీమియమ్, ఏఎల్ఎల్ వీఆర్ఆర్ సపోర్ట్, డాల్బి విజన్ ఐక్యూ, హెచ్డీఆర్10, హెచ్డీఆర్10+, హెచ్‌ఎల్‌జీ ఉన్నాయి.
బెటర్ ఆడియో కోసం టీవీలో 49 వాట్ 2.1 చానల్ స్పీకర్స్ సబ్‌వూఫర్ తో సహా అందించారు. ఓఎస్ విషయానికి వస్తే, ఈ టీవీ VIDAA U6 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.
Hisense A7K ఫీచర్లు
Hisense A7K స్మార్ట్ టీవీలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50-ఇంచ్ డిస్ప్లే, 4కే (3840*2160 పిక్సెల్) రెజుల్యూషన్, డాల్బి విజన్, డాల్బి అట్మాస్, జేబీఎల్-61వాట్ బిల్ట్-ఇన్ వూఫర్ ఉన్నాయి. VIDAA Smart OS పై ఈ టీవీ పని చేస్తుంది.
Hisense A6K TV
ఈ HISENSE A6K TV గూగుల్ టీవీ ప్లాట్ఫామ్ పై పని చేస్తుంది. ఈ టీవీలో 43-ఇంచ్ డిస్ప్లే, 4కే రెజుల్యూషన్, ఏఐ అడాప్టివ్ డెప్త్ టెక్నాలజీ, హెచ్డీఆర్ డాల్బి విజన్, హెచ్డీఆర్10+ ఉన్నాయి.
