Home News HMD Atlas: 120 హెర్ట్జ్ డిస్ప్లేతో లాంచ్ కానున్న అట్లాస్, త్వరలో లాంచ్

HMD Atlas: 120 హెర్ట్జ్ డిస్ప్లేతో లాంచ్ కానున్న అట్లాస్, త్వరలో లాంచ్

Highlights
  • త్వరలో HMD Atlas లాంచ్
  • ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్

Nokia పేరెంట్ కంపెనీ HMD త్వరలో Atlas అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయబోతోంది. HMD Atlas ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తాజాగా లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 48ఎంపి మెయిన్ కెమెరా, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 5జీ కనెక్టివిటీ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. ఓసారి తాజాగా లీకైన పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

HMD Atlas స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: HMD Atlas లో 6.64-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: HMD Atlas లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్.

మెమొరీ: HMD Atlas 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోంది. దీంతో పాటు మరొక మెమొరీ వేరియంట్ కూడా ఉండే అవకాశం ఉంది.

కెమెరా: HMD Atlas లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: HMD Atlas లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు.

ఇతర ఫీచర్లు: HMD Atlas లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.1, వై-ఫై 5, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

HMD Atlas ధర (లీక్)

HMD Atlas డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను 239.99 డాలర్లు (సుమారు రూ.20,000) గా ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

HMD Atlas స్మార్ట్‌ఫోన్ ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్ లో లభించనుందని లీకైన ఫోటో ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి హెచ్ఎండీ త్వరలోనే ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.