ఫిన్‌ల్యాండ్‌కి చెందిన మొబైల్‌ఫోన్ల తయారీదారు HMD నేడు గ్లోబల్‌గా మ్యాటెల్ కంపెనీతో కలిసి HMD Barbie Flip అనే ఫీచర్ ఫోన్‌ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఫోల్డబుల్ ఫోన్ కావాలనుకునే వారు ఈ బార్జీ ఫ్లిప్ ను ప్రయత్నించవచ్చు. మరి, ఈ ఫోన్ ధర, లభ్యత మరియు పూర్తి ఫీచర్లను తెలుసుకుందామా?
HMD Barbie Flip ప్రత్యేకతలు
HMD Barbie Flip ఫీచర్ ఫోన్ పింక్ కలర్ లో మాత్రమే లభిస్తుంది. అలాగే ఐటర్ డిస్ప్లే పై ఒక స్క్రీన్ ఉంటుంది. దీన్ని మిర్రర్ లాగా వాడుకోవచ్చు. రెండు ఇంటర్ ఛేంజబుల్ బ్యాక్ కవర్స్ తో ఫోన్ వస్తోంది.
HMD Barbie Flip డివైజ్ బాక్స్ తో పాటు బార్బీ స్టిక్కర్స్, స్టిక్-ఆన్ క్రిస్టల్స్, ఫ్లవర్స్, ఫ్లెమింగోస్ మరియు రెయిన్‌బోస్ వస్తాయి. కస్టమర్లు తన ఛాయిస్ ప్రకారం ఫోన్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే ఫోన్ కూడా కస్టమ్ యూజర్ ఇంటర్‌ఫేస్ తో వస్తోంది. ఇందులో భాగంగా బార్బీ వాల్‌పేపర్స్ మరియు బార్బీ యాప్ ఐకన్స్ అందించారు.
HMD Barbie Flip ఫోన్ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: HMD Barbie Flip డివైజ్ లో 2.8-ఇంచ్ క్యూవీజీఏ ఇంటర్నల్ స్క్రీన్, 1.77-ఇంచ్ ఎక్స్‌టర్నల్ స్క్రీన్ ఉంటాయి.
చిప్సెట్: HMD Barbie Flip లో యూనిఎస్ఓసీ టీ107 చిప్సెట్ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: HMD Barbie Flip డివైజ్ 64ఎంబి ర్యామ్, 128ఎంబి స్టోరేజీతో వచ్చింది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 32జిబి వరకు మెమొరీని పెంచుకోవచ్చు.
కెమెరా: ఇప్పుడు కెమెరా వివరాలు తెలుసుకుందాం. HMD Barbie Flip లో వీజీఏ రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి.
బ్యాటరీ: HMD Barbie Flip లో పవర్ బ్యాకప్ కోసం 1450 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 9 గంటల టాక్ టైమ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఇతర ఫీచర్లు: HMD Barbie Flip డివైజ్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సీ-పోర్, జీఎస్ఎమ్/జీపీఆర్ఎస్ 900/1800, డబ్ల్యూసీడీఎంఏ, ఎల్టీఈ క్యాట్1 ఉన్నాయి.
బరువు, చుట్టుకొలత: HMD Barbie Flip డివైజ్ 108.4 మి.మీ పొడవు, 55.1 మి.మీ వెడల్పు, 18.9 మి.మీ మందం, 123.5 గ్రాముల బరువు ఉంటుంది.
HMD Barbie Flip ధర, లభ్యత
HMD Barbie Flip డివైజ్ ధరను యూకే లో 99 పౌండ్లు (సుమారు రూ.11,000) గా ఉంది. ఇతర యూరోపియన్ దేశాల్లో 129 యూరోలు (సుమారు రూ.12,000) గా ఉంది. నేటి నుంచి ఈ దేశాల్లో ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది.
HMD Barbie Flip ధర యూఎస్ లో 129 డాలర్లు (సుమారు రూ.10,800) గా ఉంది. ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 1 నుంచి సేల్ మొదలవుతుంది.
