HMD బ్రాండ్ తన డివైజెస్‌ను గ్లోబల్ మార్కెట్ తో పాటు భారత్ లో కూడా విస్తరించే పనిలో నిమగ్నమైంది. ఇటీవలె హెచ్ఎండి సంస్థ భారత్ లో HMD Crest, Crest Max అనే స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఇప్పుడు తన గ్లోబల్ సోషల్ మీడియా హ్యాండిల్ పై కొత్త ఫోన్ HMD Barbie flip యొక్క లాంచ్ వివరాలను షేర్ చేసింది. అలాగే డివైజ్ గ్లిమ్స్ ను కూడా టీజర్ లో రివీల్ చేసింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
HMD Barbie flip ఫోన్ లాంచ్ తేదీ
HMD Barbie flip ఫోన్ వివరాలను సోషల్ మీడియా వేదిక X పై సదరు సంస్థ షేర్ చేసింది. ఆగస్టు 28న ఫోన్ లాంచ్ కానుందని తన పోస్ట్ లో హెచ్ఎండి కంపెనీ తెలిపింది. ఇమేజ్ లో డివైజ్ కూడా కనిపిస్తోంది.
HMD Barbie flip ఫోన్ బ్రైట్ పింక్ బోర్డర్ తో కనిపిస్తోంది. దాంతో పాటు, హెచ్ఎండి బ్రాండింగ్ కూడా ఉంది.
HMD Barbie flip కి సంబంధించి ఇప్పటివరకు పెద్దగా వివరాలేమీ తెలియలేదు. అయితే ఇది ఫీచర్ ఫోన్ అని అంచనా వేస్తున్నారు. చూడటానికి, Nokia 2660 flip మాదిరి కనిపిస్తోంది.
Hi Barbie! 💓
Coming 28 August 👀. Be the First to Get It! 🎉
Sign up now: https://t.co/XKep2MvuKO pic.twitter.com/Zp0XedBXwC
— HMD (@HMDdevices) July 29, 2024
Nokia 2660 flip డీటెయిల్స్
Nokia 2660 flip ఫోన్ లో 2.8-ఇంచ్ క్యూవీజీఏ డిస్ప్లే, 1.77-ఇంచ్ క్యూవీజీఏ సెకండరీ డిస్ప్లే ఉన్నాయి.
Nokia 2660 flip డివైజ్ లో యూనిఎస్ఓసీ టీ107 చిప్సెట్ వాడారు.
Nokia 2660 flip లో 0.3ఎంపి కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 4.2, 3.5ఎంఎం ఆడియో జాక్, మైక్రోయూఎస్బీ పోర్ట్ ఉన్నాయి.
Nokia 2660 flip ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 1450 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. 48ఎంబి ర్యామ్, 128ఎంబి ఇంటర్నల్ స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 32జిబి వరకు పెంచుకునే వీలుంది. Nokia 2660 flip ధర రూ.4,299 గా ఉంది.
