Home News HMD Hyper: లాంచ్‌కి ముందు లీకైన హెచ్ఎండి హైపర్ డిజైన్, స్పెసిఫికేషన్స్

HMD Hyper: లాంచ్‌కి ముందు లీకైన హెచ్ఎండి హైపర్ డిజైన్, స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో HMD Hyper లాంచ్
  • లీకైన స్పెసిఫికేషన్స్
  • ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్

ఫిన్‌ల్యాండ్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ HMD త్వరలో ఒక కొత్త ఫోన్‌ని భారత్ తో సహా, గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేయనుంది. HMD Hyper పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఇంకా ఈ ఫోన్ కి సంబంధించి కంపెనీ నుంచి అధికార ప్రకటన రాలేదు. ఈలోపు ఫోన్ ఇమేజ్ తో పాటు స్పెసిఫికేషన్స్ సోషల్ మీడియా ద్వారా లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

HMD Hyper స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: లీక్ ప్రకారం, ఈ ఫోన్ లో ఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

చిప్సెట్: HMD Hyper లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు.

మెమొరీ: HMD Hyper డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. మెమొరీని పెంచుకునేందుకు మైక్రోఎస్డీ కార్డ్‌ను కూడా వినియోగించవచ్చు.

కెమెరా: HMD Hyper లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి సెకండరీ లెన్స్, 8ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: HMD Hyper లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: HMD Hyper లో 5జీ, 4జీ, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.

సాఫ్ట్‌వేర్: HMD Hyper డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ తో లాంచ్ కానుంది.

HMD Hyper డిజైన్ (లీక్)

HMD Hyper స్మార్ట్‌ఫోన్ యొక్క డిజైన్ సోషల్ మీడియా వేదిక X పై ప్రత్యక్షమైంది. లీకైన ఇమేజ్ ప్రకారం, ఈ ఫోన్ డిజైన్ గతంలో వచ్చిన Nokia Lumia మోడల్స్ మాదిరి ఉంది.

లీకైన ఇమేజ్ లో ఫోన్ యెల్లో కలర్ లో కనిపిస్తోంది. ముందువైపు పంచ్ హోల్ కటౌట్ ఉంది.

బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఎల్ఈడీ ఫ్లాష్, రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉన్నాయి. వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ ఫోన్‌కి కుడివైపున ఉన్నాయి.