HMD: లాంచ్‌కి ముందు లీకైన HMD Pulse Pro రెండర్స్, స్పెసిఫికేషన్స్, ధర వివరాలు

Highlights

  • త్వరలో HMD Pulse Pro లాంచ్
  • సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్
  • 90 హెర్ట్జ్ ఫ్లాట్ డిస్ప్లే

స్మార్ట్‌ఫోన్ల తయారీదారు HMD నుంచి త్వరలో పల్స్ సిరీస్ లో ఫోన్లు లాంచ్ కానున్నాయి. భారత్ తో సహా గ్లోబల్ మార్కెట్స్ లో ఈ డివైజెస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. తాజాగా OnLeaks సౌజన్యంతో 91mobiles HMD Pulse Pro యొక్క రెండర్స్‌ని రివీల్ చేసింది. అలాగే ఈ ఫోన్ అంచనా ధర, స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి. ఓసారి HMD Pulse Pro డివైజ్ రెండర్స్, ధర మరియు స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

HMD Pulse Pro ధర (అంచనా)

లీకైన సమాచారం ప్రకారం, HMD Pulse Pro డివైజ్ ధర 179 యూరోలు ఉంటుందని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీలో ఇది రూ.15,950 అని చెప్పవచ్చు. భారత్ లో లాంచ్ అయ్యాక ఈ ధరలో మార్పు ఉంటుంది.

HMD Pulse Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: HMD Pulse Pro లో 6.56-ఇంచ్ ఐపీఎస్ స్క్రీన్, 1480*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సన్నని బెజెల్స్, ఫ్లాట్ డిస్ప్లే, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

కెమెరా: HMD Pulse Pro లో 50ఎంపి సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి.

చిప్సెట్: HMD Pulse Pro లో యూనిఎస్ఓసీ టీ606 ప్రాసెసర్ ఉంటుంది. ఎంట్రీ లెవెల్ ఫోన్లలో ఎక్కువగా ఈ చిప్సెట్ కనిపిస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: HMD Pulse Pro డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ: HMD Pulse Pro డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియదు.

బరువు: HMD Pulse Pro డివైజ్ 196 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: HMD Pulse Pro డివైజ్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ52 స్ప్లాష్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంటాయి.

Previous articleRealme: వచ్చే వారం అమెజాన్ ద్వారా భారత్‌లో లాంచ్ అవుతోన్న Narzo 70x 5G
Next articleOPPO A60: గూగుల్ ప్లే కన్సోల్‌పై లిస్టైన ఒప్పో ఏ60
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.