HMD Skyline: 144Hz రిఫ్రెష్ రేట్‌తో భారత్‌లో కొత్త హెచ్ఎండి ఫోన్ విడుదల

Highlights

  • భారత్‌లో HMD Skyline లాంచ్
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ
  • డివైజ్ ధర రూ.35,999

ఫిన్‌ల్యాండ్ కు చెందిన స్మార్ట్‌ఫోన్ మేకర్ HMD తాజాగా భారతీయ మార్కెట్ లో HMD Skyline అనే స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ బ్యాక్ కవర్ చేంజింగ్ టెక్నాలజీతో వచ్చింది. అలాగే యాప్స్, నేవిగేషన్ మరియు ఏఐ-పవర్డ్ అసిస్టెంట్‌‌ను యాక్సెస్ చేసేందుకు కస్టమ్ బటన్స్‌ను ఈ ఫోన్ లో అందించారు. జులై నెలలో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. భారతీయ వేరియంట్ లో మార్పులేమీ లేవు. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

HMD Skyline ధర మరియు లభ్యత

HMD Skyline స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది. దీని ధరను రూ.35,999 గా నిర్ణయించారు.

సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అమెజాన్.ఇన్, హెచ్ఎండి.కామ్, మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

HMD Skyline డివైజ్ ట్విస్టెడ్ బ్లాక్ మరియు నియన్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, కస్టమర్లకు 33 వాట్ టైప్ సీ ఫాస్ట్ చార్జర్ ని కంపెనీ ఉచితంగా అందిస్తోంది.

HMD Skyline స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: HMD Skyline లో 6.55-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 20:9 యాస్పెక్ట్ రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: HMD Skyline స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వాడారు.

మెమొరీ: HMD Skyline 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 512జిబి వరకు పెంచుకునే వీలుంది.

కెమెరా: HMD Skyline లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఈ కెమెరా సెటప్ ఓఐఎస్, ఈఐఎస్ టెక్నాలజీతో వచ్చింది. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: HMD Skyline లో పవర్ బ్యాకప్ కోసం 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 15 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

సాఫ్ట్‌వేర్: HMD Skyline డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళు ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: HMD Skyline లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: HMD Skyline లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, డ్యూయల్ స్పీకర్స్, ఐపీ54 రేటింగ్, జెన్ 2 రిపేరబులిటీ ఆప్షన్స్ ఉన్నాయి.