HMD Skyline: గీక్‌బెంచ్‌పై లిస్టైన హెచ్ఎండి స్కైలైన్, త్వరలో లాంచ్ అయ్యే అవకాశం

Highlights

  • త్వరలో HMD Skyline లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ చిప్సెట్
  • 108ఎంపి ప్రైమరీ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ HMD నుంచి త్వరలో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. HMD Skyline పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్పామ్ గీక్‌బెంచ్‌పై లిస్ట్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం. ఓసారి గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

HMD Skyline గీక్‌బెంచ్ లిస్టింగ్

HMD Skyline స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై లిస్టైంది. ఈ వివరాలను క్రింద ఇమేజ్ ద్వారా గమనించవచ్చు.

ఇకపోతే, HMD Skyline ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1027 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2857 పాయింట్లు స్కోర్ చేసింది.

లిస్టింగ్ పై మదర్‌బోర్డ్ కోడ్ నేమ్ “టామ్ క్యాట్” అని ఉంది. ఈ ఫోన్ లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.40 గిగాహెర్ట్జ్.

చిప్సెట్ వివరాలను బట్టి, ఈ డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

HMD Skyline డివైజ్ లిస్టింగ్ పై 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది. ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

HMD Skyline స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: HMD Skyline లో ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది.

చిప్సెట్: HMD Skyline లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉంటుంది.

కెమెరా: HMD Skyline లో 108ఎంపి మెయిన్ కెమెరా, మ్యాక్రో లేదా డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నారు.

బ్యాటరీ: HMD Skyline లో పవర్ బ్యాకప్ కోసం 4900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: HMD Skyline లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ67 రేటింగ్ ఉంటాయి.

HMD Skyline ధర (లీక్)

HMD Skyline డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ కానుంది. దీని ధర 520 యూరోలు (సుమారు రూ.47,000) గా ఉంటుందని గతంలో బయటకు వచ్చిన లీక్స్ ద్వారా తెలుస్తోంది.

Previous articleOPPO: గ్లోబల్‌గా లాంచైన Reno 12, Reno 12 Pro
Next articleVivo Y58 5G: స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌తో భారత్‌లో లాంచైన వై58 5జీ
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.