HMD: 90Hz డిస్ప్లే‌తో గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచైన HMD Vibe

Highlights

  • యూఎస్‌లో HMD Vibe లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్
  • 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ HMD నుంచి త్వరలో వరుసగా స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. తాజాగా HMD Vibe ఫోన్ గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ యూఎస్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్, 13ఎంపి ప్రైమరీ కెమెరా, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో HMD Vibe వచ్చింది. ఓసారి పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం.

HMD Vibe ధర

HMD Vibe స్మార్ట్‌ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.

HMD Vibe ధర యూఎస్ మార్కెట్ లో 149 డాలర్లుగా ఉంది. అంటే భారతీయ కరెన్సీలో దీన్ని రూ.12,500 అని చెప్పవచ్చు.

మే నెల నుంచి HMD Vibe యొక్క సేల్ మొదలవుతుంది. అంతేకాదు, త్వరలోనే భారత్ లో కూడా హెచ్ఎండీ ఫోన్లు లాంచ్ కానున్నాయి.

HMD Vibe స్పెసిఫికేషన్స్

స్క్రీన్: HMD Vibe లో 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 720*1480 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: HMD Vibe లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz.

ర్యామ్, స్టోరేజీ: HMD Vibe డివైజ్ అమెరికాలో 6జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో 4జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. దీంతో యూజర్ కి గరిష్టంగా 10జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు.

కెమెరా: HMD Vibe లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ఫ్రంట్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: HMD Vibe లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: HMD Vibe లో భద్రత కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు. ఐపీ52 స్ప్లాష్ రేటింగ్, బ్లూటూత్ 5.0, 3.5ఎంఎం ఆడియో జాక్, 4జీ, డ్యూయల్ సిమ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

Previous article120Hz అమోలెడ్ డిస్ప్లేతో లాంచైన OPPO K12
Next articleRealme C65 5G: డైమెన్సిటీ 6300 చిప్సెట్‌తో భారత్‌లో లాంచైన రియల్మీ కొత్త ఫోన్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.