త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Honda Benly e ఎలక్ట్రిక్ స్కూటర్: ధర, రేంజ్, కలర్స్, ఇమేజెస్, స్పెసిఫికేషన్స్

హైలైట్స్:

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న హోండా బెన్లీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్
  • ఇప్పటికే చైనా మరియు జపాన్ దేశాల్లో లాంచ్ అయి విజయవంతమైన స్కూటర్
  • భారత్ లో బెన్లీ ఈ స్కూటర్ ధర రూ.90,000 నుంచి రూ.1,00,000 మధ్య ఉండే అవకాశం

జపాన్ కి చెందిన హోండా కంపెనీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టూవీలర్లు, కార్ల తయారీలో ఈ కంపెనీ ఎంతో పేరు సంపాదించింది. తాజాగా హోండా భారత ఈ-స్కూటర్ మార్కెట్ లోకి అడుగు పెట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా హోండా సంస్థ బెన్లీ ఈ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది. జూన్ 2021 లో ఈ ఈ-స్కూటర్ ఏఆర్ఏఐ వద్ద టెస్టింగ్ చేస్తున్నప్పుడు కనిపించింది. మళ్ళీ ఇప్పుడు బెంగళూరులో డీలర్ నంబర్ ప్లేట్ తో మరోసారి టెస్టింగ్ లో భాగంగా కనిపించింది. ఈసారి జిగ్‌వీల్స్ ఈ బండిని గుర్తించి వార్తను వెలుగులోకి తెచ్చింది.

ఎకనమిక్ టైమ్స్ తో మాట్లాడుతూ, హోండా ఎండీ, ప్రెసిడెంట్, హెచ్ఎంఎస్ఐ సీఈవో అట్సుషీ ఒగాటా, “చైనా, జపాన్ దేశాల్లో అనుభవలాను బట్టి, ఈ-స్కూటర్లను నడపడం తేలికైన విషయమని కస్టమర్లు భావిస్తున్నారు. చైనాలో అత్యధిక భాగం ఎలక్ట్రిక్ వాహనాలు ఈ-స్కూటర్లే కాగా, మరికొన్ని ఈ-మోటర్ సైకిల్స్ ఉన్నాయి.” అని అన్నారు. హోండా ఇండియా తమ రాబోవు ఈ-స్కూటర్ కంటే ఎక్కువగా, మార్చుకోదగిన బ్యాటరీ సిస్టమ్ ను పరీక్షించారు. బెన్లీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో హోండా మొబైల్ పవర్ ప్యాక్ ని వాడారు. ఒకవేళ హోండా కంపెనీ బ్యాటరీ స్వాప్ స్టేషన్స్ నెట్వర్క్ ని ఏర్పాట్ చేయగలిగితే, కచ్చితంగా ఓలా హైపర్ చార్జర్ నెట్వర్క్, హీరో గొగొరో స్వాప్ స్టేషన్స్ కి గట్టి పోటి ఇచ్చేందుకు హోండా సిద్ధమైనట్లే. దేశ వ్యాప్తంగా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేసేందుకు హోండా కంపెనీ, హిందుస్థాన్ పెట్రోలియమ్ కార్పొరేషన్ లిమిటెడ్ తో జట్టు కట్టింది.

భారత్ లో Honda Benly e అంచనా ధర

మనేసర్ లోని హెచ్ఎంఎస్ఐ ప్లాంట్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారవుతున్నాయి. భారత మార్కెట్లో పెద్ద ఎత్తున ఈ-స్కూటర్లను లాంచ్ చేయాలని భావిస్తోన్న హోండా, బెన్లీ ఈ స్కూటర్లను ఇండియాలోనే తయారు చేస్తోంది. మార్కెట్ లోకి వచ్చాక, ఈ స్కూటర్ ధర రూ.90,000 నుంచి రూ.1,00,000 మధ్య ఉండనుంది.

Honda Benly e ఫీచర్లు

‘హోండా బెన్లీ ఈ’ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వెనకాల బాస్కెట్ క్యారియర్, ముందు లగేజ్, స్టోరేజీ స్పేస్ ఉన్నాయి. హోండా బెన్లీ ఈ, వీధుల్లో ఎటువంటి శబ్ధం చేయకుండా గమ్మున పరుగెడుతుంది. ఇక అంతే, మీరు యదేచ్చగా బెన్లీ బండిపై స్మూత్ గా క్రూజ్ చేయవచ్చు.

Honda Benly e కలర్స్, వేరియంట్స్

ప్రస్తుతం రాస్ వైట్ అనే ఒకే రంగులో ఈ బండి అందుబాటులో ఉంది. ఇకపోతే రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ లో ఈ బండి లభిస్తుంది. అవి బెన్లీ ఈ1, బెన్లీ ఈ1 ప్రో. ఈ రెండు మోడల్స్ కూడా 2.8 కిలో వాట్ మోటర్ కలిగి ఉండి, 12 ఎన్ఎం పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు వేరియంట్స్ సింగిల్ చార్జ్ తో 30 కేఎంపీహెచ్ గరిష్ట వేగంతో 87 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. హోండా బెన్లీ ఈ2, ఈ2 ప్రో 4.2 కిలో వాట్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ కలిగి ఉండి, 15ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తాయి. ఈ మోడల్ 60 కిలోమీటర్ల వేగం వద్ద ఒక్క చార్జి కి 43 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

బెన్లీ ఈ బండి ఎన్నో వేరియంట్స్ లో లభ్యమవుతున్నప్పటికీ, ప్రతి వేరియంట్ కూడా కేవలం ఒకే ఒక్క రైడింగ్ మోడ్ ని కలిగి ఉండటం గమనార్హం. కనెక్టివిటీ విషయానికి వస్తే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ రైడర్ కు కావాల్సిన స్పీడ్ తదితర సమాచారాన్ని చూపిస్తుంది. డిస్ప్లే సరిగ్గా మధ్యలో ఉండటం చేత, ఈజీగా రైడర్ కు యాక్ససబులిటీ ఉంటుంది. ప్రస్తుతం ఈ బండ్లు బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి లేవు. డిస్ప్లే పై అన్ని వివరాలు అందుబాటులో ఉంటున్నందున, బ్లూటూత్ కనెక్టివిటీ లేకపోవడం పెద్ద సమస్య కాబోదు.

స్వాపబుల్ బ్యాటరీ ఆప్షన్స్ ఉన్నందున, ఈ స్కూటర్ చార్జింగ్ ప్రక్రియ ఎంతో తేలికవుతుంది. కేవలం నిమిషం వ్యవధిలో డ్రెయిన్ అయిన బ్యాటరీల స్థానంలో పూర్తి చార్జితో ఉన్న బ్యాటరీలను మార్చుకోవచ్చు. పికప్ మరియు డెలివరీ సమస్యలు ఈ స్వాపబుల్ బ్యాటరీ ఆప్షన్ తో తీరిపోతాయి. హోండా యొక్క ఎంపీపీ బ్యాటరీస్ పై ఈ-స్కూటర్ పని చేస్తుంది. ట్విన్ బ్యాటరీ ప్యాక్స్ స్కూటర్లో ఉంటాయి. ఒక్కో బ్యాటరీ 0.99 కిలోవాట్ కెపాసిటీని కలిగి ఉంటుంది. రెండు బ్యాటరీలను కూడా స్వాప్ చేసుకునేందుకు వీలుంది.

Honda Benly e స్పెసిఫికేషన్స్

  • 2 వీలర్ టైప్ – ఎలక్ట్రిక్ స్కూటర్
  • మాగ్జిమమ్ అవుట్ పుట్ (కిలోవాట్స్/పీఎస్/ఆర్పీఎం) – 2.8/3.8/3,000
  • మోటర్ టార్క్ – ఎన్ఏ
  • సీట్ హైట్ – 710 ఎంఎం
  • ఇంజిన్ మరియు గేర్ బాక్స్:
  • కంటిన్యూస్ పవర్ – ఎన్ఏ
  • మాగ్జిమమ్ పవర్ – ఎన్ఏ
  • మోటార్ టార్క్ – ఎన్ఏ
  • బ్యాటరీ సెల్ ప్రొడ్యూసర్ – లిథియమ్ అయాన్ బ్యాటరీ (హోండా)
  • ఎనర్జీ రికవరీ – బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్

బ్రేక్స్ అండ్ టైర్స్

  • ఫ్రంట్ టైర్ – 90/90-12 44జె
  • రియర్ టైర్ – 110/90-10 61జె
  • ఫ్రంట్ బ్రేక్ – మెకానికల్ లీడింగ్/ట్రెయిలింగ్
  • రియర్ బ్రేక్ – మెకానికల్ లీడింగ్/ట్రెయిలింగ్
  • బ్రేకింగ్ సిస్టమ్ – ఎన్ఏ

డైమెన్షన్ అండ్ వెయిట్:

బెన్లీ ఈ1 మరియు బెన్లీ ఈ2

  • బరువు – 84 కిలోలు
  • పొడవు – 1,820 మిల్లీమీటర్లు
  • వెడల్పు – 710 మిల్లీమీటర్లు
  • ఎత్తు – 1025 మిల్లీమీటర్లు
  • సీట్ హైట్ – 710 మిల్లీమీటర్లు

కన్సోల్ ఫీచర్లు

  • స్పీడోమీటర్ – డిజిటల్
  • ఫ్యూయల్ గేజ్ – డిజిటల్

బ్యాటరీ అండ్ రేంజ్

  • బ్యాటరీ వోల్టేజీ – 50.4 వోల్ట్స్
  • బ్యాటరీ కెపాసిటీ – 20.8 ఏహెచ్
  • బ్యాటరీ ఎనర్జీ – ఎన్ఏ
  • బ్యాటరీ వెయిట్ – ఎన్ఏ
  • టాప్ స్పీడ్ – ఈ1, ఈ1 ప్రో మోడళ్ళ టాప్ స్పీడ్ 30 కేఎంపీహెచ్. ఈ2, ఈ2 ప్రో టాప్ స్పీడ్ 60 కేఎంపీహెచ్
  • రేంజ్ – ఈ1, ఈ1 ప్రో రేంజ్ 87 కిలోమీటర్లు. ఈ2, ఈ2 ప్రో రేంజ్ 43 కిలోమీటర్లు
  • చార్జ్ టైమ్ – ఎన్ఏ
  • బ్యాటరీ లైఫ్ – ఎన్ఏ
  • పవర్ మోడ్స్ – బెన్లీ యొక్క ఏ మోడల్ కూడా విభిన్న రైడింగ్ మోడ్స్ ని కలిగి లేదు. కానీ, మోడల్ ని బట్టి టాప్ స్పీడ్స్, రేంజెస్ ఉన్నాయి.
  • వీల్ బేస్ – 1280ఎంఎం
  • వీల్ మెటీరియల్ – అల్లాయ్

రివ్యూ:

చైనా, జపాన్ లో కస్టమర్లు ఇప్పటికే ఈ బండిని వాడుతున్నారు. అక్కడ యూజర్లు బండి పట్ల, రేంజ్ మరియు బ్యాటరీ విషయంలో సంతోషంగానే ఉన్నట్లు సమాచారం.

ప్లస్ పాయింట్స్:

  • డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ కి అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్
  • రెండు బ్యాటరీలను కూడా స్వాప్ చేసుకునే అవకాశముండటం
  • లగేజ్ ని మోసుకెళ్ళేందుకు వీలుగా వెనకాల ఫ్లాట్ డెక్ ఉండటం

మైనస్ పాయింట్స్:

  • నో బ్యాక్ సీట్ – వెనకాల ఎవరినైనా కూర్చొబెట్టుకొని వెళ్ళాలంటే కష్టమే. సీటు ఉంటే బాగుండేది. దీనికి ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాటు ఉందో లేదో తెలియదు.
  • విభిన్న రైడింగ్ మోడ్స్ లేకపోవడం
  • బేస్ మోడల్ టాప్ స్పీడ్ కేవలం 30 కేఎంపీహెచ్

Honda Benly e పోటీదారులు

ఏథర్ 450ఎక్స్, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో బెన్లీ ఈ పోటీపడనుంది.