హైలైట్స్
- EICMA 2022 లో ప్రదర్శించబడిన Honda EM1 e స్కూటర్
- త్వరలో యూరప్ తో పాటు ఇతర మార్కెట్స్ లో లాంచ్ కానున్న బండి
- రిమూవబుల్, స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్ తో వస్తోన్న Honda EM1 e
EICMA 2022 ఈవెంట్ లో Honda EM1 e ప్రదర్శితమైంది. తన అప్‌కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని హోండా కంపెనీ జనాలకు పరిచయం చేసింది. తొలుత Honda EM1 e బండి యూరోపియన్ మార్కెట్ లో లాంచ్ అవ్వనుంది. తర్వాత ఇతర దేశాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది వేసవి కాలంలో Honda EM1 e మార్కెట్ లోకి అడుగు పెడుతుంది.
యూరప్ లోని యువతను ఉద్దేశించి Honda EM1 e ని రంగంలోకి దింపబోతున్నట్లు జపాన్ దిగ్గజ కంపెనీ హోండా తెలిపింది. ప్రత్యేకించి పట్టణాలు, నగరాల్లో స్వల్ప దూరాలను చేరుకునేందుకు, సాధారణ ప్రయాణాల కోసం Honda EM1 e బాగా ఉపయోగపడనుంది.
Honda EM1 e డిజైన్ గురించి తెలుసుకుందాం. బండికి హోండా మినమలిస్టిక్ డిజైన్ ని అందించింది. దీని డిజైన్ తీరుతెన్నులు Honda యొక్క Benly e బండిని గుర్తుకుతెచ్చాయి. షార్ట్ హ్యాండిల్, ఆంగ్యులర్ మరియు కాంపాక్ట్ చాసిస్ తో బండి కనిపిస్తోంది. రైడర్ కాళ్ళు పెట్టుకునేందుకు ఫ్లాట్ ఫ్లోర్, సరిపడా స్థలం ఉన్నాయి. ఇక వెనకాల భాగం పెద్దదిగా సీటు క్రింద స్టోరేజీ స్పేస్ తో వస్తోంది.
హోండా యొక్క మొబైల్ పవర్ ప్యాక్ ఈ ని Honda EM1 e లో వాడినట్లు సమాచారం. దీన్ని బట్టి ఇది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అని అర్థమవుతోంది. సింగిల్ చార్జ్ పై Honda EM1 e 40 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది. రిమూవబుల్ బ్యాటరీ ఉండటంచేత బ్యాటరీని తొలగించి ఇంట్లో ఉండే నార్మల్ ప్లగ్ ఇన్ పాయింట్స్ వద్ద చార్జింగ్ పెట్టవచ్చు. లేదంటే ప్రత్యేకమైన ఒక చార్జింగ్ యూనిట్ ని ఏర్పాటు చేసుకోవచ్చు.
బండి వెనక వీల్ పై హబ్-మౌంటెడ్ మోటర్ ని హోండా వాడినట్లు ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. మనం టెలీస్కోపిక్ ఫోర్క్, డిస్క్ బ్రేక్స్ ని ఫ్రంట్ వీల్ పై గమనించవచ్చు. ఇకపోతే ముందు, వెనక ఎల్ఈడీ లైట్స్ ని అమర్చారు. Honda EM1 e కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
2025 కల్లా 10 లేదా అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ మోడల్స్ ని తీసుకొస్తామని హోండా ప్రామిస్ చేసింది. యూరప్ లో వచ్చే ఏడాది ఎంట్రీ ఇచ్చిన తర్వాత Honda EM1 e బండి భారత్ లో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. భారత టూ-వీలర్ మార్కెట్ లో హోండా కి గట్టి పట్టు ఉన్న విషయం తెలిసిందే. భారత్ లో Honda EM1 e ఏమేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.