Home News Geekbench పై లిస్టైన Honor 100, Honor 100 Pro; కన్ఫర్మ్ అయిన చిప్సెట్!

Geekbench పై లిస్టైన Honor 100, Honor 100 Pro; కన్ఫర్మ్ అయిన చిప్సెట్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Honor 100 సిరీస్
  • గీక్‌బెంచ్ పై లిస్టైన Honor 100, 100 Pro
  • స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌తో వస్తోన్న Honor 100

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారు Honor త్వరలో Honor 100 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Honor 100, Honor 100 Pro అనే డివైజెస్ రానున్నాయి. నవంబర్ 23 న ఈ ఫోన్లు చైనాలో లాంచ్ కానున్నాయి. తాజాగా ఈ ఫోన్లు బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ పై కనిపించాయి. దీంతో రెండు ఫోన్ల యొక్క చిప్సెట్ వివరాలు తెలిసాయి. సరే, ఓసారి Honor 100 మరియు Honor 100 Pro యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Honor 100, Honor 100 Pro గీక్‌బెంచ్ వివరాలు

Honor 100, Honor 100 Pro స్మార్ట్‌ఫోన్లు గీక్‌బెంచ్ 6 పై లిస్ట్ అవ్వడంతో వీటి యొక్క స్పెసిఫికేషన్స్ పై స్పష్టత వచ్చింది. గీక్‌బెంచ్ 6 పై స్టాండర్డ్ మోడల్ Honor 100 MAA-AN00 అనే మోడల్ నంబర్ తో లిస్టైంది. ఇంకా లిస్టింగ్ లో SM7550 అనే మోడల్ నంబర్ ని చిప్సెట్ కలిగి ఉంది. ఈ మోడల్ ని బట్టి స్టాండర్డ్ వేరియంట్ Honor 100 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది.

Honor 100, Honor 100 Pro స్పెసిఫికేషన్స్