Honor 100 సిరీస్ లాంచ్ తేదీని హానర్ సంస్థ నేడు అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 23 న చైనాలో Honor 100 సిరీస్ లాంచ్ అవుతోంది. ఈ లైనప్ లో Honor 100 మరియు Honor 100 Pro మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అంతేకాదు, హానర్ కంపెనీ Honor 100 సిరీస్ డివైజెస్ యొక్క డిజైన్ ని కూడా రివీల్ చేసింది. టీజర్ ప్రకారం, స్టాండర్డ్ వేరియంట్ Honor 100 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. మరోవైపు Honor 100 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. సరే, ఓసారి Honor 100 సిరీస్ టీజర్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Honor 100 సిరీస్ టీజర్ విశేషాలు
- Honor తాజాగా విడుదల చేసిన టీజర్ లో Honor 100 మరియు Honor 100 Pro డివైజెస్ వైట్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో కనిపించాయి.
- లాంచ్ సమయంలో మరిన్ని కలర్ ఆప్షన్స్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
- Honor 100 సిరీస్ 1.5కే రెజుల్యూషన్ డిస్ప్లే, 3,840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ (పల్స్ విడ్త్ మాడ్యులేషన్) డిమ్మింగ్ సపోర్ట్ ఉంటాయి.
- అలాగే ఈ సిరీస్ డివైజెస్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుందని సమాచారం.
- గతంలో 3సీ సర్టిఫికేషన్ ద్వారా రివీలైన సమాచారం ప్రకారం, Honor 100 సిరీస్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ఇంకా బయటకు రాలేదు.
Honor 90 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Honor 90 స్మార్ట్ఫోన్ లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
- ప్రాసెసర్: Honor 90 స్మార్ట్ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Honor 90 లో 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. టర్బో ర్యామ్ ఫీచర్ ద్వారా 7జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
- కెమెరా: Honor 90 స్మార్ట్ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ, చార్జింగ్: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్వేర్: Honor 90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని ఇవ్వనున్నట్లు కంపెనీ చెబుతోంది.
- కలర్స్: Honor 90 డివైజ్ గ్లాస్ బ్యాక్, పాలి కార్బొనేట్ ఫ్రేమ్ తో వచ్చింది. ఈ ఫోన్ డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
