ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ HONOR భారతీయ మార్కెట్ లో తన ప్రీమియమ్ మిడ్-రేంజ్ ఫోన్లను లాంచ్ చేసింది. HONOR 200 5G, HONOR 200 Pro 5G పేర్లతో ఈ మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఫోన్లు సెగ్మెంట్-ఫస్ట్ సిలికాన్ కార్బన్ బ్యాటరీలతో రావడం విశేషం. ఈ తరహా బ్యాటరీల వల్లన 6 శాతం పవర్ డెన్సిటీ మరియు మెరుగైన చార్జింగ్ రేట్స్ ఉంటాయని సమాచారం. కొత్త హానర్ 200 5జీ సిరీస్ యొక్క ధరలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
HONOR 200 5G సిరీస్ ధర, లభ్యత
HONOR 200 5G రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.34,999 గా నిర్ణయించారు. 12జిబి+512జిబి మోడల్ ధరను రూ.39,999 గా పెట్టారు.
HONOR 200 Pro 5G సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీతో వచ్చిన ఈ ఫోన్ ధరను రూ.57,999 గా పెట్టారు.
HONOR 200 5G బ్లాక్ మరియు మూన్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. HONOR 200 Pro 5G ఓషన్ సైయన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. జులై 20వ తేదీ నుంచి అర్థరాత్రి నుంచి అమెజాన్ ఇండియా, ఎక్స్‌ప్లోర్ హానర్ ఈ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
జులై 20 మరియు జులై 21వ తేదీల్లో జరిగే అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో భాగంగా ఈ ఫోన్లపై హానర్ లాంచ్ ఆఫర్లను అందిస్తోంది.
హానర్ 200 ప్రో 5జీ పై రూ.8,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, హానర్ 200 5జీ పై రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.
ఐసీఐసీఐ, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మరియు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా ప్రో మోడల్ కొంటే రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇదే ఆఫర్ స్టాండర్డ్ మోడల్ పై కూడా ఉంది. కానీ, రూ.2,000 డిస్కౌంట్ మాత్రమే లభిస్తుంది.
ఇవే కాకుండా, రూ.2,000 ఇన్‌స్టంట్ కూపన్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది.
HONOR 200 Pro 5G సిరీస్ స్పెసిఫికేషన్స్
Honor 200 5G
డిస్ప్లే: Honor 200 5G లో 6.7-ఇంచ్ క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 2700*1224 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
ప్రాసెసర్: Honor 200 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 720 జీపీయూ ఉపయోగించారు.
మెమొరీ: Honor 200 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
సాఫ్ట్‌వేర్: Honor 200 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరా: Honor 200 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్906 మెయిన్ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్856 టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్+మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Honor 200 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ సూపర్‌చార్జ్ టెక్నాలజీతో వచ్చింది.
కనెక్టివిటీ: Honor 200 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, ఓటీజీ, జీపీఎస్/ఏజీపీఎస్/గ్లొనాస్/బైడూ/గెలీలియో, యూఎస్బీ స్పీకర్స్, జీపీయూ టర్బో ఎక్స్, ఆల్-రేంజ్ కూలింగ్ సిస్టమ్ 2.0 ఉన్నాయి.
బరువు, చుట్టుకొలత: Honor 200 5G డివైజ్161.5 మి.మీ పొడవు, 74.6 మి.మీ వెడల్పు, 7.7 మి.మీ మందం, 187 గ్రాముల బరువు ఉంటుంది.
Honor 200 Pro 5G
డిస్ప్లే: Honor 200 Pro 5G లో 6.78-ఇంచ్ క్వాడ్-కర్వ్డ్ ఫ్లోటింగ్ అమోలెడ్ స్క్రీన్, 2700*1224 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, అడాప్టివ్ డిమ్మింగ్, నేచురల్ టోన్ 2.0 ఉన్నాయి.
ప్రాసెసర్: Honor 200 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్, ఆర్ఎఫ్ ఎన్హాన్స్‌డ్ చిప్ హానర్ సీ1+ ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 735 జీపీయూ వాడారు.
మెమొరీ: Honor 200 Pro 5G స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది.
సాఫ్ట్‌వేర్: Honor 200 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరా: Honor 200 Pro 5G 50ఎంపి సూపర్ డైనమిక్ హెచ్9000 సెన్సర్ పొట్రెయిట్ మెయిన్ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్856 టెలీఫోటో లెన్స్, 12ఎంపి అల్ట్రా-వైడ్+మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి+2ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు.
బ్యాటరీ: Honor 200 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ సూపర్‌చార్జ్ టెక్నాలజీతో వచ్చింది. 66 వాట్ వైర్లెస్ సూపర్‌చార్జ్ సపోర్ట్ కూడా ఉంది.
కనెక్టివిటీ: Honor 200 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, ఓటీజీ, జీపీఎస్/ఏజీపీఎస్/గ్లొనాస్/బైడూ/గెలీలియో, యూఎస్బీ టైప్-సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Honor 200 Pro 5G లో యూనివర్శల్ ఐఆర్ రిమోట్ కంట్రోల్, హానర్ హిస్టెన్ స్పేషియల్ ఆడియో, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, జీపీయూ టర్బో ఎక్స్, ఆల్-రేంజ్ కూలింగ్ సిస్టమ్ 2.0 ఉన్నాయి.
బరువు, చుట్టుకొలత: Honor 200 Pro 5G డివైజ్ 163.3 మి.మీ పొడవు, 75.2 మి.మీ వెడల్పు, 8.2 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.
