ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor తన హోమ్ మార్కెట్ చైనాలో Honor 200 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ లైనప్ లో హానర్ 200 మరియు హానర్ 200 ప్రో అనే మోడల్స్ వచ్చాయి. చైనా లాంచ్ తర్వాత, ఇండియా లాంచ్‌ని కూడా హానర్ సంస్థ ఖరారు చేసింది. జూన్ నెలలో హానర్ 200 సిరీస్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఓసారి హానర్ 200 సిరీస్ చైనా లాంచ్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ఇండియా లాంచ్ వివరాలను తెలుసుకుందాం.
Honor 200 సిరీస్ ఇండియా లాంచ్ (ఖరారు)
Honor 200 సిరీస్ ఇండియా లాంచ్‌ని కంపెనీ సీఈవో మాధవ్ సేథ్ సోషల్ మీడియా ద్వారా ఖరారు చేశారు.
తన పోస్ట్ లో హానర్ సంస్థ, కమింగ్ సూన్ (త్వరలో రాబోతోంది) అని పేర్కొంది. ఏఐ, అప్‌గ్రేడెడ్ కెమెరా ఫీచర్స్ వంటి వాటిని కంపెనీ హైలైట్ చేస్తోంది.
చైనాలో ఏవైతే మోడల్స్ లాంచ్ అయ్యాయో అవే మోడల్స్ భారతీయ మార్కెట్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
హానర్ 200 సిరీస్ ఇండియా లాంచ్ ఏ తేదీన ఉంటుందో ఇంకా తెలియదు. కానీ, జూన్ నెలలో ఉంటుందని అర్థమవుతోంది.
Ready to reimagine smartphones?
Watch out the space for the announcement. #HONOR200 pic.twitter.com/UV0Sk9VrM3— Madhav Sheth (@MadhavSheth1) May 27, 2024
Honor 200 స్పెసిఫికేషన్స్ (చైనా)
డిస్ప్లే: Honor 200 లో 6.7-ఇంచ్ క్వాడ్-కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2664*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Honor 200 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ వాడారు.
కెమెరా: Honor 200 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఐఎంఎక్స్906 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్856 టెలీఫోటో 2.5x OIS టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
సాఫ్ట్‌వేర్: Honor 200 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Honor 200 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5029ఎంఎం2 హీట్ డిస్సిపేషన్ యూనిట్, డ్యూయల్ స్పీకర్స్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.
Honor 200 Pro స్పెసిఫికేషన్స్ (చైనా)
డిస్ప్లే: Honor 200 Pro లో 6.7-ఇంచ్ క్వాడ్-కర్వ్డ్ ఓఎల్ఈడీ 1.5కే స్క్రీన్, 2700*1224 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Honor 200 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు.
కెమెరా: Honor 200 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒవి50హెచ్ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50ఎంపి ఐఎంఎక్స్856 టెలీఫోటో 2.5x OIS లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 3డీ డెప్త్ సెకండరీ సెన్సర్ ఇచ్చారు.
బ్యాటరీ: Honor 200 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 66 వాట్ వైర్లెస్ చార్జింగ్ మరియు రివర్స్ వైర్లెస్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: Honor 200 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Honor 200 Pro లో డ్యూయల్ సిమ్, ఐఆర్ బ్లాస్టర్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఎన్ఎఫ్‌సీ, ఐపీ55 సర్టిఫికేషన్, సీ1+ ఆర్ఎఫ్ ఎన్హాన్స్మెంట్ చిప్ ఉన్నాయి.
Honor 200, Honor 200 Pro ధరలు (చైనా)
Honor 200 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 2699 యువాన్లు (సుమారు రూ.30,975) గా నిర్ణయించారు.
Honor 200 12జిబి + 512జిబి మోడల్ ధర 2999 యువాన్లు (సుమారు రూ.34,420).
Honor 200 16జిబి + 256జిబి మోడల్ ధర 2999 యువాన్లు (సుమారు రూ.34,420).
Honor 200 16జిబి ర్యామ్ + 512జిబి టాప్ వేరియంట్ ధరను 3199 యువాన్లు (సుమారు రూ.37,500) గా పెట్టారు.
Honor 200 Pro విషయానికి వస్తే, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 3499 యువాన్లు (సుమారు రూ.40,145) గా ఉంది.
12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర 3799 యువాన్లు (సుమారు రూ.43,585) గా ఉంది.
16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర 3999 యువాన్లు (సుమారు రూ.45,880) గా ఉంది.
16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధరను 4499 యువాన్లు (సుమారు రూ.51,620) గా ఉంది.
Honor 200 మరియు Honor 200 Pro స్మార్ట్‌ఫోన్లు స్కై బ్లూ, కోరల్ పింక్, మూన్ షాడో వైట్ మరియు ఇంక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.
