Home News Honor 200 Smart: 5,200mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన హానర్ కొత్త ఫోన్

Honor 200 Smart: 5,200mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన హానర్ కొత్త ఫోన్

Highlights
  • జర్మనీలో Honor 200 Smart విడుదల
  • ఐపీ64 వాటర్ & డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్
  • 6.8-ఇంచ్ 120హెర్జ్ట్ ఎల్సీడీ స్క్రీన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor తన 200 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Honor 200 Smart పేరుతో ఈ డివైజ్ జర్మనీలో విడుదలైంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 35 వాట్ సూపర్‌చార్జ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Honor 200 Smart ధర, కలర్ ఆప్షన్స్

Honor 200 Smart జర్మనీ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. రానున్న రోజుల్లో ఇతర మార్కెట్స్ లో ఈ ఫోన్ విడుదల కానుంది. జర్మనీలో ఈ ఫోన్ ధర 199.90 యూరోలు (సుమారు రూ.18,599) గా ఉంది. ఈ ఫోన్ ఫారెస్ట్ గ్రీన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Honor 200 Smart ఇండియా లాంచ్ పై ఇంకా స్పష్టత లేదు.

Honor 200 Smart స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Honor 200 Smart లో 6.8-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, టీఎఫ్‌టీ ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Honor 200 Smart లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 613 జీపీయూ అందించారు.

మెమొరీ: Honor 200 Smart డివైజ్ 4జిబి ర్యామ్ తో లాంచ్ అయ్యింది. 4జిబి వర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో 8జిబి వరకు ర్యామ్ ను పెంచుకోవచ్చు. ఈ ఫోన్ లో 256జిబి స్టోరేజీ అందించారు.

కెమెరా: Honor 200 Smart లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Honor 200 Smart లో పవర్ బ్యాకప్ కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Honor 200 Smart లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.