Home News 200MP కెమెరాతో భారత్‌లో లాంచ్ కానున్న Honor 90

200MP కెమెరాతో భారత్‌లో లాంచ్ కానున్న Honor 90

Highlights
  • భారతీయ మార్కెట్ లో కొత్త ఫోన్ ని లాంచ్ చేయనున్న Honor
  • సెప్టెంబర్ లో లాంచ్ కానున్న Honor 90 స్మార్ట్ ఫోన్
  • 200ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానున్న డివైజ్

Honor స్మార్ట్ ఫోన్ లవర్స్ కి గుడ్ న్యూస్ వచ్చేసింది. చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ త్వరలోనే మళ్ళీ భారతీయ మార్కెట్ లోకి రీ-ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ యూట్యూబర్ ప్రకారం, Honor 90 డివైజ్ తో సదరు సంస్థ రీ-ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఇప్పటికే Honor 90 డివైజ్ గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి Honor 90 అంచనా స్పెసిఫికేషన్స్, లాంచ్ టైమ్‌లైన్ గురించి తెలుసుకుందాం పదండి.

Honor 90 భారత మార్కెట్ లాంచ్ టైమ్‌లైన్ (అంచనా)

యూట్యూబర్ గౌరవ్ చౌదరి (టెక్నికల్ గురూజీ), Honor 90 ఇండియా లాంచ్ సమాచారం రివీల్ చేశారు. సెప్టెంబర్ లో Honor 90 డివైజ్ భారత్ లో లాంచ్ అవుతుందని గౌరవ్ వెల్లడించారు. అయితే, ఈ అప్‌కమింగ్ డివైజ్ ధర ఎంత ఉంటుందో ఇంకా తెలియదు. రానున్న రోజుల్లో Honor నుంచి వచ్చే అధికార ప్రకటనతో మరింత స్పష్టత రానుంది.

Honor 90 స్పెసిఫికేషన్స్, కలర్స్ (అంచనా)

Honor 90 ఇప్పటికే పలు గ్లోబల్ మార్కెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. టిప్‌స్టర్ ప్రకారం, ఇండియన్ వేరియంట్ కూడా గ్లోబల్ వేరియంట్ మాదిరి స్పెసిఫికేషన్స్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. సరే, ఓసారి ఆ వివరాలు చూద్దాం.

Honor 90 స్మార్ట్ ఫోన్ గ్లోబల్ గా 4 కలర్ ఆప్షన్స్ తో లాంచ్ అయ్యింది. అవి: పీకాక్ బ్లూ, డైమండ్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్. యూట్యూబ్ వీడియోలో టిప్‌స్టర్ ఎమరాల్డ్ గ్రీన్ వేరియంట్ ని చూపించారు. మరి గ్లోబల్ వేరియంట్ లాగే నాలుగు కలర్ ఆప్షన్స్ లో ఇండియాలో లాంచ్ అవుతుందా? లేదా ఏమైనా మార్పులు ఉంటాయా? అనే వివరాలు రానున్న రోజుల్లో రివీల్ కానున్నాయి.