Honor 90 పై ఆఫర్ ప్రకటించిన సంస్థ; వివరాలు తెలుసుకోండి!

Highlights

  • హానర్ డేస్ సేల్ మొదలుపెట్టిన కంపెనీ
  • Honor 90 పై భారీ డిస్కౌంట్
  • 200ఎంపి కెమెరా కలిగిన Honor 90

Honor 90 స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో 2023 సెప్టెంబర్ నెలలో లాంచ్ అయ్యింది. అమెజాన్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇక ప్రస్తుతం హానర్ డేస్ సేల్ ని కంపెనీ ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా Honor 90 ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. Honor 90 డివైజ్ 200ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి సెల్ఫీ కెమెరా, 12జిబి వరకు ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో వచ్చింది. సరే, ఓసారి Honor 90 ఆఫర్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Honor 90 ఆఫర్స్

  • Honor 90 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ని కేవలం రూ.31,999 కే సొంతం చేసుకోవచ్చు.
  • Honor 90 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ని సేల్ లో రూ.33,999 కే కొనుగోలు చేయవచ్చు.
  • హానర్ డేస్ సేల్ లో Honor 90 పై రూ.3,000 డిస్కౌంట్ లభిస్తుంది.
  • ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ పై కస్టమర్లకు రూ.3,000 అదనపు డిస్కౌంట్ లభించనుంది.
  • ఇంకా Honor 90 ఫోన్ ని 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ స్కీమ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
  • అమెజాన్.ఇన్ ద్వారా Honor 90 ని కొనుగోలు చేయవచ్చు.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్ ఉంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 లో 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. టర్బో ర్యామ్ ఫీచర్ ద్వారా 7జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Honor 90 స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200 ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 90 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. రెండేళ్ళ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని కంపెనీ హామీనిస్తోంది.
  • కలర్స్: Honor 90 డివైజ్ గ్లాస్ బ్యాక్, పాలి కార్బొనేట్ ఫ్రేమ్ తో వచ్చింది. ఈ ఫోన్ డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Previous article2024 లో లాంచ్ కానున్న Redmi K70 Ultra; లీకైన స్పెసిఫికేషన్స్!
Next articleలీకైన Vivo X Fold 3 Pro స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.