
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 లో Magic 6 Pro స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ అమేజింగ్ కెమెరా సెటప్ తో వచ్చింది. Honor Magic 6 Pro లో 180ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ని కలిగి ఉంది. ఇంకా ఈ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. సరే, ఓసారి Honor Magic 6 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.
Honor Magic 6 Pro ధర
- Honor Magic 6 Pro స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ గా 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీతో లాంచ్ అయ్యింది.
- Honor Magic 6 Pro ధరను 1299 యూరోలు గా నిర్ణయించారు. భారతీయ కరెన్సీలో దీని ధర రూ.1,16,669 గా ఉంటుంది.
- Honor Magic 6 Pro డివైజ్ సేల్ మార్చి 1 నుంచి యూరప్ లో మొదలుకానుంది. ఈ ఫోన్ ఎపిక్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- Honor Magic 6 Pro భారత్ లో లభిస్తుందా లేదా అనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.
Honor Magic 6 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Honor Magic 6 Pro లో 6.80-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 1280*2800 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్టీపీవో ఓఎల్ఈడీ ఫ్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4320 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Honor Magic 6 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.
- బ్యాటరీ: Honor Magic 6 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 66 వాట్ వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Honor Magic 6 Pro డివైజ్ 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ ఆప్షన్ తో లాంచ్ అయ్యింది.
- ఓఎస్: Honor Magic 6 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Honor Magic 6 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, యూఎస్బీ టైప్ సీ, యూఎస్బీ 3.1 ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: Honor Magic 6 Pro లో ఐపీ68 రేటింగ్, ఎన్ఎఫ్సీ సపోర్ట్, 3డీ ఫేస్ రికగ్నిషన్, ఫింగర్ ప్రింట్ స్కానర్, డీటీఎస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.











