ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor త్వరలో భారతీయ మార్కెట్ లో మ్యాజిక్ సిరీస్ ఫోన్ లాంచ్ చేయనుంది. Honor Magic 6 Pro పేరుతో ఈ డివైజ్ లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారతదేశ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టులో ఈ ఫోన్ లాంచ్ అవుతోంది. 6.8-ఇంచ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్, 50ఎంపి కెమెరాతో వస్తోన్న ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ మరియు పూర్తి స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Honor Magic 6 Pro ధర (అంచనా)
Honor Magic 6 Pro స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర చైనాలో 5699 యువాన్లు (సుమారు రూ.65,000) గా ఉంది.
16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను 6199 యువాన్లు (సుమారు రూ.68,000) గా నిర్ణయించారు. 16జిబి ర్యామ్ + 1టిబి స్టోరేజీ వేరియంట్ ధరను 6699 యువాన్లు (సుమారు రూ.77,000) గా పెట్టారు.
భారతీయ వేరియంట్ ధర కూడా చైనా మోడల్ మాదిరే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Honor Magic 6 Pro స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
డిస్ప్లే: Honor Magic 6 Pro లో 6.8-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, కర్వ్డ్ ఓఎల్ఈడీ ప్యానెల్, అడాప్టివ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% డీసీఐ-పీ3 కలర్ గ్యామట్, హెచ్డీఆర్10+ సపోర్ట్, 5000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Honor Magic 6 Pro డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.
మెమొరీ: Honor Magic 6 Pro 12జిబి/16జిబి ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ టెక్నాలజీని ఈ ఫోన్ లో అందించారు.
కెమెరా: Honor Magic 6 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 180ఎంపి ఓఐఎస్ పెరిస్కోప్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా, 3డీ డెప్త్ సెన్సర్ ఉన్నాయి.
సాఫ్ట్‌వేర్: Honor Magic 6 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
బ్యాటరీ: Honor Magic 6 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ వైర్డ్ చార్జింగ్, 66 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Honor Magic 6 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ ఉన్నాయి.
