Home News లాంచ్‌కి ముందు లీకైన Honor Magic 6 స్పెసిఫికేషన్స్

లాంచ్‌కి ముందు లీకైన Honor Magic 6 స్పెసిఫికేషన్స్

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Honor Magic 6
  • తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్
  • అమోలెడ్ డిస్ప్లేతో వస్తోన్న Honor Magic 6

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor త్వరలో Honor Magic 6 డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. ఈలోపు Honor Magic 6 డివైజ్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. తమ అప్‌కమింగ్ Honor Magic 6 కోసం పోర్షే డిజైన్ తో పార్టర్ అయినట్లు హానర్ తెలిపింది. తాజాగా లీకైన Honor Magic 6 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Honor Magic 6 స్పెసిఫికేషన్స్ (లీక్)

Honor Magic 6 సెక్యూరిటీ చిప్ తో రానున్నట్లు సమాచారం. రేడియో ఫ్రీక్వెన్సీ, శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం ఇది ఉపయోగపడనుంది. ఐఫోన్స్ తో పాటు OPPO Find X7 Ultra, Samsung Galaxy S24 Ultra ఫోన్లలో ఈ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్ కనిపిస్తుంది.

Honor Magic 6 డివైజ్ ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది.

లీకైన Honor Magic 6 రెండర్ ని గమనిస్తే, సర్కులర్ కెమెరా మాడ్యూల్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ వేరియబుల్ అపర్చర్ సపోర్ట్ గల 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి పెరిస్కోప్ టెలీఫోటో కెమెరా ఈ ఫోన్ లో ఉండవచ్చు.

మరోవైపు Honor Magic 6 Pro 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ 1/1.3-ఇంచ్ ప్రైమరీ ఓఐఎస్ సెన్సర్, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 160ఎంపి పెరిస్కోప్ లెన్స్ ఉంటాయని సమాచారం. Honor Magic 6 Pro 2కే ఓఎల్ఈడీ డిస్ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది.

Honor Magic 6 సిరీస్ 2024 ఫిబ్రవరిలో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.