HONOR Magic 7: స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌తో లాంచ్ కానున్న హానర్ మ్యాజిక్ 7

Highlights

  • త్వరలో HONOR Magic 7 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్
  • 50ఎంపి మెయిన్ కెమెరా

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ HONOR త్వరలో మ్యాజిక్ 6 సిరీస్‌కు సక్సెసర్ HONOR Magic 7 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా, HONOR Magic 7 మరియు HONOR Magic 7 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా HONOR Magic 7 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

HONOR Magic 7 స్పెసిఫికేషన్స్ (లీక్)

HONOR Magic 7 యొక్క స్పెసిఫికేషన్స్‌ను చైనాకు చెందిన సామాజిక మాధ్యమం వీబో పై టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ షేర్ చేశారు. ఆ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

లీక్ ప్రకారం, HONOR Magic 7 డివైజ్ 1.5కే రెజుల్యూషన్ గల డిస్ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే, HONOR Magic 7 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 టెలీఫోటో కెమెరా, 50ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి.

HONOR Magic 7 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుందని సమాచారం. ఈ చిప్సెట్ రాబోయే అక్టోబర్ లో లాంచ్ అవుతుంది.

లేటెస్ట్ లీక్ ద్వారా బ్యాటరీ సైజ్ రివీల్ కాలేదు. మ్యాజిక్ 7 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది.

Honor Magic 6 స్పెసిఫికేషన్స్ (చైనా)

డిస్ప్లే: Honor Magic 6 లో 6.78-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1264*2800 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

చిప్సెట్: Honor Magic 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 750 జీపీయూ వినియోగించారు.

ర్యామ్, స్టోరేజీ: Honor Magic 6 డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

కెమెరా: Honor Magic 6 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి వైడ్ యాంగిల్ ఓఐఎస్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో ఓఐఎస్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Honor Magic 6 లో పవర్ బ్యాకప్ కోసం 5450 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 66 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Previous articleXiaomi: చైనాలో లాంచైన MIX Fold 4, MIX Flip
Next articleMotorola: 32MP ఫ్రంట్ కెమెరాతో లాంచ్ కానున్న Edge 50 Neo
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.