
ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ Honor చైనా మార్కెట్ లో తాజాగా Honor Play 50 Plus డివైజ్ ని లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ ప్రస్తుతం చైనా లోనే అందుబాటులో ఉంది. భారత్ లో లాంచ్ అవుతుందా లేదా అన్నది ఇంకా తెలియదు. ఇకపోతే, Honor Play 50 Plus డివైజ్ 90 హెర్ట్జ్ ఎల్సీడీ స్క్రీన్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉన్నాయి. సరే, ఓసారి Honor Play 50 Plus పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వివరాలు తెలుసుకుందాం.
Honor Play 50 Plus ధర
Honor Play 50 Plus డివైజ్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. Honor Play 50 Plus డివైజ్ యొక్క 12జిబి వేరియంట్ ధరను 1,399 యువాన్లు (195 డాలర్లు) గా నిర్ణయించారు. Honor Play 50 Plus ఫోన్ మ్యాజిక్ నైట్ బ్లాక్, గ్రీన్, స్టార్ పర్పుల్, స్ట్రీమింగ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Honor Play 50 Plus స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Honor Play 50 Plus లో 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 850 నిట్స్ బ్రైట్నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- చిప్సెట్: Honor Play 50 Plus లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్ వాడారు.
- మెమొరీ: Honor Play 50 Plus డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
- కెమెరా: Honor Play 50 Plus లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి + 8ఎంపి ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి.
- ఓఎస్: Honor Play 50 Plus డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Honor Play 50 Plus లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Honor Play 50 Plus లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
- చుట్టుకొలత, బరువు: Honor Play 50 Plus డివైజ్ 166.7 మి.మీ పొడవు, 76.5 మి.మీ వెడల్పు, 8.24 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.











