Home News 6.8-ఇంచ్ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Honor Play 50 Plus

6.8-ఇంచ్ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో చైనాలో లాంచైన Honor Play 50 Plus

Highlights
  • చైనాలో లాంచైన Honor Play 50 Plus
  • 90Hz ఎల్సీడీ స్క్రీన్ తో వచ్చిన డివైజ్
  • Honor Play 50 Plus ధర 1,399 యువాన్లు

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor చైనా మార్కెట్ లో తాజాగా Honor Play 50 Plus డివైజ్ ని లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ ప్రస్తుతం చైనా లోనే అందుబాటులో ఉంది. భారత్ లో లాంచ్ అవుతుందా లేదా అన్నది ఇంకా తెలియదు. ఇకపోతే, Honor Play 50 Plus డివైజ్ 90 హెర్ట్జ్ ఎల్సీడీ స్క్రీన్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా, 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉన్నాయి. సరే, ఓసారి Honor Play 50 Plus పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వివరాలు తెలుసుకుందాం.

Honor Play 50 Plus ధర

Honor Play 50 Plus డివైజ్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ. Honor Play 50 Plus డివైజ్ యొక్క 12జిబి వేరియంట్ ధరను 1,399 యువాన్లు (195 డాలర్లు) గా నిర్ణయించారు. Honor Play 50 Plus ఫోన్ మ్యాజిక్ నైట్ బ్లాక్, గ్రీన్, స్టార్ పర్పుల్, స్ట్రీమింగ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Honor Play 50 Plus స్పెసిఫికేషన్స్