3C సర్టిఫికేషన్ ద్వారా రివీలైన Honor Play 50 Plus ప్రధాన స్పెసిఫికేషన్స్!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Honor Play 50 Plus
  • 3సీ సర్టిఫికేషన్ పై కనిపించిన డివైజ్
  • రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్ త్వరలో చైనాలో ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. Honor Play 50 Plus పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. అయితే భారత్ లోకి మళ్ళీ వస్తోన్న హానర్ బ్రాండ్ Honor 90 డివైజ్ ని లాంచ్ చేయబోతోంది. ఈలోపు చైనాలో పలు ఫోన్లను లాంచ్ చేస్తూ పోతోంది హానర్. అయితే Honor Play 50 Plus డివైజ్ భారత గడ్డపై అడుగుపెడుతుందో లేదో ఇంకా తెలియదు.

Honor Play 50 Plus స్మార్ట్ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ పై కనిపించిందని Gizmochina ఒక కథనాన్ని రాసుకొచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 3సీ సర్టిఫికేషన్ ద్వారా డివైజ్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ హానర్ యొక్క ప్లే సిరీస్ లో భాగంగా మార్కెట్ లోకి రానుంది. మరి Honor Play 50 Plus డివైజ్ 3సీ లిస్టింగ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Honor Play 50 Plus లాంచ్ వివరాలు

Honor Play 50 Plus స్మార్ట్ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై CLK-AN00 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. ఒక చైనీస్ టిప్‌స్టర్ ఈ స్మార్ట్ ఫోన్ ప్లే-సిరీస్ లో భాగంగా రానుందని తెలిపారు. 2023 సెప్టెంబర్ నెలలో Honor Play 50 Plus డివైజ్ లాంచ్ కానుందని సమాచారం.

Honor Play 50 Plus స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor Play 50 Plus స్మార్ట్ ఫోన్ లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • చిప్సెట్: Honor Play 50 Plus డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడనున్నట్లు సమాచారం.
  • బ్యాటరీ: Honor Play 50 Plus లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • చార్జింగ్: Honor Play 50 Plus డివైజ్ 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

Honor Play 50 Plus స్పెసిఫికేషన్స్ ని గమనిస్తే, హానర్ సంస్థ ఒక మిడ్-రేంజ్ డివైజ్ పై పని చేస్తున్నట్లు అర్థమవుతోంది. త్వరలోనే Honor Play 50 Plus కి సంబంధించిన అధికార ప్రకటన కంపెనీ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Honor 90 స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

Honor 90 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Honor 90 లో 6.7-ఇంచ్ అమోలెడ్ క్వాడ్-కర్వ్డ్ ఫ్లోటింగ్ స్క్రీన్ ఉంటుంది.
  • కెమెరా: Honor 90 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 200ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. Honor 90 లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • ప్రాసెసర్: Honor 90 లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 యాక్సలరేటెడ్ ఎడిషన్ చిప్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 డివైజ్ 8జిబి+256జిబి, 12జిబి+256జిబి, 12జిబి+512జిబి మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 90 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Honor 90 డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఇది 66 వాట్ సూపర్‌చార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Honor 90 లో బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ, వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ సిమ్, 5జీ వంటి ఫీచర్లు ఉంటాయి.
Previous articleఇన్‌స్టంట్ వీడియో మెసేజెస్ ఫీచర్‌ని పరిచయం చేసిన WhatsApp
Next articleలాంచ్‌కి ముందు రివీలైన POCO M6 Pro 5G డిజైన్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.