చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ Honor త్వరలో Honor X50 GT అనే స్మార్ట్ఫోన్ తో యూజర్ల ముందుకు వస్తోంది. తాజాగా ఈ డివైజ్ లాంచ్ తేదీని అధికారికంగా కంపెనీ ప్రకటించింది. జనవరి 4 వ తేదీన Honor X50 GT డివైజ్ చైనా మార్కెట్ లోకి వస్తోంది. Gizmochina తన కథనంలో ఈ లాంచ్ వివరాలను తెలిపింది. తర్వాత గ్లోబల్ గా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి Honor X50 GT డివైజ్ యొక్క లాంచ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
రివీలైన Honor X50 GT డిజైన్
- Honor X50 GT డివైజ్ కర్వ్డ్-ఎడ్జ్ ఓఎల్ఈడీ స్క్రీన్ తో వస్తోంది. ఈ ఫోన్ బ్లాక్ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో వస్తున్నట్లు ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
- బ్లాక్ వేరియంట్ సాధారణమైన బ్యాక్ డిజైన్ కలిగి ఉండగా, వైట్ వేరియంట్ బ్యాక్ ప్యానెల్ పై గోల్డ్ స్ట్రిప్ ఉంది. ఈ స్ట్రిప్ 108ఎంపి ప్రైమరీ కెమెరాను సూచిస్తోంది.
- Honor X50 GT లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. హానర్ నుంచి ఈ ఫోన్ కి సంబంధించి మరే ఇతర స్పెసిఫికేషన్స్ అఫీషియల్ గా వెల్లడి కాలేదు.
Honor X50 Pro స్పెసిఫికేషన్స్ (రూమర్స్)
- డిస్ప్లే: Honor X50 Pro లో ఓఎల్ఈడీ ప్యానెల్, 1.5కే రెజుల్యూషన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Honor X50 Pro లో స్నాప్డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Honor X50 Pro డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
- బ్యాటరీ: Honor X50 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంటుంది.
- ఓఎస్: Honor X50 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- సెక్యూరిటీ: Honor X50 Pro లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించనున్నారు.
మరో వార్తను గమనిస్తే, హానర్ సంస్థ జనవరి 10 మరియు జనవరి 11 తేదీల్లో Honor Magic 6 సిరీస్ ఫ్లాగ్షిప్ ఫోన్లను చైనాలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ లైనప్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్స్ తో రానున్నట్లు సమాచారం. మ్యాజిక్ 6 సిరీస్ లో Magic 6, Magic 6 Pro, Magic 6 Porsche Design మోడల్స్ మార్కెట్ లోకి రానున్నాయి.
