చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ Honor చైనాలో X50 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆకట్టుకునే ఫీచర్లతో లాంచ్ అయ్యింది. స్నాప్డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 12జిబి ర్యామ్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే వంటి ఫీచర్లు Honor X50 Pro లో ఉన్నాయి. సరే, ఓసారి Honor X50 Pro స్మార్ట్ఫోన్ యొక్క ధర, కలర్ ఆప్షన్స్ మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
Honor X50 Pro ధర, కలర్ ఆప్షన్స్
- Honor X50 Pro స్మార్ట్ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 2,799 (సుమారు రూ.33,600) గా నిర్ణయించారు.
- Honor X50 Pro డివైజ్ గ్రీన్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- ప్రస్తుతం ఈ డివైజ్ చైనా మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. భారత్ లో ఈ డివైజ్ లాంచ్ అవుతుందా? లేదా? అనే విషయం ఇంకా తెలియదు. సరే, ఓసారి Honor X50 Pro స్పెసిఫికేషన్స్ పై కన్నేద్దాం పదండి.
Honor X50 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Honor X50 Pro లో 6.78-ఇంచ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 10-బిట్ స్క్రీన్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Honor X50 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ లో 5100ఎంఎం2 వేపర్ కూలింగ్ సిస్టమ్ ఉంది.
- ర్యామ్, స్టోరేజీ: Honor X50 Pro డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది.
- కెమెరా: Honor X50 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Honor X50 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Honor X50 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Honor X50 Pro లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.2, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
