ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor కొన్ని రోజుల క్రితం చైనాలో Honor X9b డివైజ్ ని లాంచ్ చేసింది. తాజాగా Honor X9b ఇండియా లాంచ్ ఖరారైంది. ఇక హానర్ తన రీఎంట్రీలో భారతీయ మార్కెట్ లో Honor 90 ని పరిచయం చేసింది. ఇప్పుడు Honor X9b ని కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Honor X9b ఇండియా లాంచ్‌ని హానర్ కంపెనీ ఇండియా హెడ్ మాధవ్ సేథ్ సోషల్ మీడియా ద్వారా ఖరారు చేశారు. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
Honor X9b ఇండియా లాంచ్ ఖరారు
Guess the phone!
Join me for an exclusive firsthand experience.
The one with the most reposts and tagged friends wins it. pic.twitter.com/7i0mDrGJ4Q— Madhav Sheth (@MadhavSheth1) January 12, 2024
- Honor ఇండియా హెడ్ మాధవ్ సేథ్ Honor X9b ఇండియా లాంచ్‌ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా కన్ఫర్మ్ చేశారు.
- మాధవ్ సేథ్ షేర్ చేసిన వీడియోని గమనిస్తే కొన్ని రోజుల క్రితం చైనాలో లాంచైన Honor X9b అని అర్థమవుతోంది.
- Honor X9b ఇండియా లాంచ్ తేదీని త్వరలోనే కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది.
- Honor X9b స్మార్ట్‌ఫోన్ ఒక మిడ్-రేంజ్ ఫోన్ లో ఉండాల్సిన అన్ని ఫీచర్లతో మార్కెట్ లోకి రానుంది.
Honor X9b స్పెసిఫికేషన్స్ (చైనా)
- స్క్రీన్: Honor X9B 5G లో 6.78-ఇంచ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 డిగ్రీస్ యాంటీ-డ్రాప్ ప్రొటెక్షన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Honor X9B 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉంటాయి.
- ర్యామ్, స్టోరేజీ: Honor X9B 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
- సాఫ్ట్వేర్: Honor X9B 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Honor X9B 5G డివైజ్ లో 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Honor X9B 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 35 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
- కనెక్టివిటీ: Honor X9B 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉంటాయి.
- కలర్ ఆప్షన్స్: Honor X9B 5G డివైజ్ సన్‌రైజ్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్, టైటానియమ్ సిల్వర్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- సెక్యూరిటీ: Honor X9B 5G లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కాన్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్స్ ఉంటాయి.
- బరువు, చుట్టుకొలత: Honor X9B 5G డివైజ్ 163.6 మి.మీ పొడవు, 75.5 మి.మీ వెడల్పు, 7.98 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.
