
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor భారత మార్కెట్ లోకి Honor 90 అనే డివైజ్ తో రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరొక ఫోన్ ని లాంచ్ చేసేందుకు హానర్ సిద్ధమవుతోంది. Honor X9b పేరుతో రాబోవు ఈ ఫోన్ కి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా Honor X9b డివైజ్ అమెజాన్ ఇండియా పై లిస్ట్ అయ్యింది. ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. సరే, ఓసారి Honor X9b లాంచ్ తేదీ, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.
Honor X9b ఇండియా లాంచ్ తేదీ
Brace yourselves for a tech revolution! Unveiling the HONOR X9b on 15th February – a leap beyond curved displays. Get ready for the extraordinary with India's first ultra bounce display featuring 'Airbag' technology. Stay tuned! #HONORX9b #RIPTemperedGlass #ExploreHONOR pic.twitter.com/JLyP6tAHtx
— Explore HONOR (@ExploreHONOR) January 29, 2024
- Honor X9b స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ తన ‘ఎక్స్‌ప్లోర్ హానర్’ తన X ఖాతా ద్వారా ప్రకటించింది.
- ఎక్స్‌ప్లోర్ హానర్ పోస్ట్ ప్రకారం, Honor X9b డివైజ్ ఫిబ్రవరి 15 న లాంచ్ కానుందని తెలుస్తోంది.
- పోస్ట్ లో షేర్ చేయబడిన డివైజ్ ని గమనిస్తే, కర్వ్డ్ డిస్ప్లేని కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది.
- బౌన్స్ డిస్ప్లే ఫీచర్ ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీని తొలిసారిగా హానర్ ఇండియాలో ఈ డివైజ్ ద్వారా పరిచయం చేస్తోంది.
- ఈ టెక్నాలజీ ద్వారా మొబైల్ ఫోన్ క్రింద పడిపోయినప్పటికీ సురక్షితంగానే ఉంటుంది.
Honor X9b అమెజాన్ లిస్టింగ్ (లీక్)
{Exclusive} Honor X9B 5G Listed on Amazon India!!
Sunrise Orange with 12GB/256GB is confirmed ✅✅????
As leaked Combo offer will be there!!
Listed by Official Honor Store india pic.twitter.com/OoYQWlELVF
— Paras Guglani (@passionategeekz) January 27, 2024
- Honor X9b స్మార్ట్‌ఫోన్‌ని అమెజాన్ పై టిప్‌స్టర్ పారస్ గుగ్లాని గుర్తించారు. ఆ వెనువెంటనే స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
- ఇకపోతే, అమెజాన్ లిస్టింగ్ ద్వారా Honor X9b యొక్క డిజైన్, కలర్ ఆప్షన్స్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.
- Honor X9b స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోంది.
- Honor X9b డివైజ్ సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్ లో లభించనుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ డివైజ్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో కూడా లాంచ్ అవుతుందని సమాచారం.
- Honor X9b డివైజ్ కర్వ్డ్ డిస్పలే, పంచ్ హోల్ కటౌట్, సర్క్యులర్ రియర్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్, మెటల్ కేసింగ్ ని కలిగి ఉంది.
- Honor X9b తొలుత చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు అవే స్పెసిఫికేషన్స్ తో భారత్ లో కూడా లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
Honor X9b స్పెసిఫికేషన్స్ (చైనా)
- డిస్ప్లే: Honor X9b 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 1200*2652 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 429 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, ఎస్‌జీఎస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Honor X9b 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Honor X9b 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని ఆఫర్ చేస్తుంది.
- సాఫ్ట్‌వేర్: Honor X9b 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Honor X9b 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Honor X9b 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Honor X9b 5G లో 5జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, యూఎస్బీ 2.0 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
- కలర్ ఆప్షన్స్: Honor X9b 5G డివైజ్ సన్‌రైజ్ ఆరెంజ్, మిడ్నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ మరియు టైటానియమ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











