ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ Honor త్వరలో భారతీయ మార్కెట్ లో Honor X9b అనే స్మార్ట్ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఈ డివైజ్ దృఢమైన స్క్రీన్ తో వస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో Honor X9b ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ గురించి వార్తలు వచ్చాయి. ఇప్పుడు Honor X9b ఇండియా ఎంఆర్పీ లీక్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.
Honor X9b ధర (లీకైన ఎంఆర్పీ)
- లీక్ ప్రకారం, Honor X9b స్మార్ట్ఫోన్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ఎంఆర్పీ ధర రూ.30,999 గా ఉంది.
- Honor X9b ఫోన్ కొనుగోలుపై రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుందని ఓ వార్త రివీల్ అయ్యింది. డిస్కౌంట్ తర్వాత Honor X9b ధర రూ.25,000 నుంచి రూ.26,000 మధ్య ఉంటుంది.
HONOR X9B
– 6.78" 1.5K AMOLED, 120Hz
– Qualcomm Snapdragon 6 Gen 1
– 108MP + 5MP (UW) + 2MP
– 16MP selfie
– Android 13, Magic UI 7.2
– 5,800mAh batteryBox Price: Rs 30,999 (8/256GB)
Selling Price: Rs 25-26kRs 1-2k card discount
Thoughts on the pricing?
— Yogesh Brar (@heyitsyogesh) February 10, 2024
Honor X9b భారత్ లాంచ్ వివరాలు
- Honor X9b స్మార్ట్ఫోన్ భారతీయ మార్కెట్ లో ఫిబ్రవరి 15వ తేదీన లాంచ్ అవుతోంది.
- ఫిబ్రవరి 15న మధ్యాహ్నం 12.30 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభం అవుతుంది. హానర్ బ్రాండ్ యొక్క అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై ఈవెంట్ ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు.
Honor X9b స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)
- డిస్ప్లే: Honor X9b 5G లో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 1200*2652 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 429 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, ఎస్జీఎస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Honor X9b 5G లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Honor X9b 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ని ఆఫర్ చేస్తుంది.
- సాఫ్ట్వేర్: Honor X9b 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: Honor X9b 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Honor X9b 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Honor X9b 5G లో 5జీ, డ్యూయల్ సిమ్, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, యూఎస్బీ 2.0 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
- కలర్ ఆప్షన్స్: Honor X9b 5G డివైజ్ సన్రైజ్ ఆరెంజ్, మిడ్నైట్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ మరియు టైటానియమ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
