BIS సర్టిఫికేషన్ పొందిన Honor X9B 5G; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Honor X9B 5G
  • బీఐఎస్ పై లిస్టైన స్మార్ట్‌ఫోన్
  • 5,800mAh బ్యాటరీతో వస్తోన్న డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor కొన్ని రోజుల క్రితం Honor X9B 5G ని గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. దీంతో త్వరలోనే Honor X9B 5G భారత్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. Honor X9B 5G బీఐఎస్ లిస్టింగ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Honor X9B 5G బీఐఎస్ లిస్టింగ్

Honor X9B 5G డివైజ్ బీఐఎస్ సర్టిఫికేషన్ ని పొందింది. దీంతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లాంచ్ పై స్పష్టత వచ్చింది. ALI-NX అనే మోడల్ నంబర్ తో Honor X9B 5G బీఐఎస్ పై లిస్ట్ అయ్యింది. ఒక యూజర్ సోషల్ మీడియా మాధ్యమం X ద్వారా Honor X9B 5G బీఐఎస్ లిస్టింగ్ యొక్క స్క్రీన్ షాట్ షేర్ చేయడంతో వివరాలు బయటకు వచ్చాయి. సరే, ఓసారి Honor X9B 5G అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Honor X9B 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Honor X9B 5G లో 6.78-ఇంచ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 డిగ్రీస్ యాంటీ-డ్రాప్ ప్రొటెక్షన్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Honor X9B 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉంటాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Honor X9B 5G డివైజ్ 8జిబి/12జిబి ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor X9B 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Honor X9B 5G డివైజ్ లో 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Honor X9B 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 35 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • కనెక్టివిటీ: Honor X9B 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, యూఎస్బీ 2.0 వంటి ఆప్షన్స్ ఉంటాయి.
  • కలర్ ఆప్షన్స్: Honor X9B 5G డివైజ్ సన్‌రైజ్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్, టైటానియమ్ సిల్వర్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సెక్యూరిటీ: Honor X9B 5G లో భద్రత కోసం ఫింగర్ ప్రింట్ స్కాన్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్స్ ఉంటాయి.
  • బరువు, చుట్టుకొలత: Honor X9B 5G డివైజ్ 163.6 మి.మీ పొడవు, 75.5 మి.మీ వెడల్పు, 7.98 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.
Previous article50MP సెల్ఫీ కెమెరా, 108MP రియర్ కెమెరాతో లాంచైన Honor X8b
Next articleMoto Razr 40 Ultra, Razr 40 పై రూ.10,000 తగ్గింపు; వివరాలు తెలుసుకోండి!
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.