ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ Honor నేడు భారతీయ మార్కెట్ లో Honor X9b డివైజ్ ని లాంచ్ చేసింది. కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 108ఎంపి కెమెరా, 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 1.5కే రెజుల్యూషన్ తో Honor X9b మార్కెట్ లోకి వచ్చింది. హానర్ సంస్థ గతేడాది Honor 90 తో ఇండియన్ మార్కెట్ లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సరే, ఓసారి Honor X9b ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం పదండి.
Honor X9b ధర, లభ్యత
- Honor X9b డివైజ్ 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్ ధర వివరాలు మరియు లభ్యత గురించి తెలుసుకుందాం.
- Honor X9b ధరను భారతీయ మార్కెట్ లో రూ.25,999 గా నిర్ణయించారు.
- ఫిబ్రవరి 16 నుంచి ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ద్వారా Honor X9b స్మార్ట్ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
- ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్, 5,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు.
- Honor X9b స్మార్ట్ఫోన్ ని మిడ్నైట్ బ్లాక్ మరియు సన్రైజ్ ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు. సన్రైజ్ ఆరెంజ్ కలర్ వేరియంట్ వీగన్ లెదర్ బ్యాక్ తో వచ్చింది.
Honor X9b స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Honor X9b లో 6.78-ఇంచ్ 1.5కే అమోలెడ్ కర్వ్డ్ స్క్రీన్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ టెక్నాలజీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, యాంటీ-డ్రాప్ డిస్ప్లే ఉన్నాయి.
- ప్రాసెసర్: Honor X9b లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Honor X9b డివైజ్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి టర్బో ర్యామ్ ఉన్నాయి.
- కెమెరా: Honor X9b లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ, చార్జింగ్: Honor X9b లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Honor X9b డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Honor X9b లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: Honor X9b డివైజ్ ఐపీ53 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, మ్యాజిక్ టెక్స్ట్ వంటి ఫీచర్లతో వచ్చింది.
