ప్రముఖ చైనీస్ టెక్ బ్రాండ్ Huawei చైనాలో Enjoy 70 సిరీస్నను లాంచ్ చేసింది. గత నెలలో Huawei Enjoy 70 డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా Huawei Enjoy 70 Pro స్మార్ట్ఫోన్ లాంచ్ అయ్యింది. Huawei Enjoy 70 Pro లో ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ డివైజ్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. సరే, ఓసారి Huawei Enjoy 70 Pro యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Huawei Enjoy 70 Pro ధర
- Huawei Enjoy 70 Pro స్మార్ట్ఫోన్ చైనాలో రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- Huawei Enjoy 70 Pro 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను 1,449 యువాన్లు (సుమారు రూ.17,208) గా నిర్ణయించారు.
- Huawei Enjoy 70 Pro 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర 1,649 యువాన్లు (సుమారు రూ.19,583) గా ఉంది.
- Huawei Enjoy 70 Pro డివైజ్ ఒబ్సిడియన్ బ్లాక్, స్నోయీ వైట్ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Huawei Enjoy 70 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Huawei Enjoy 70 Pro డివైజ్ లో 6.7-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉన్నాయి.
- ప్రాసెసర్: Huawei Enjoy 70 Pro లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 చిప్సెట్ వాడారు. ఇది 2.4గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ చిప్సెట్.
- ర్యామ్, స్టోరేజీ: Huawei Enjoy 70 Pro డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కెమెరా: Huawei Enjoy 70 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Huawei Enjoy 70 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 40 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Huawei Enjoy 70 Pro డివైజ్ హార్మనీ ఓఎస్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Huawei Enjoy 70 Pro లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్ 5, వై-ఫై, టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
Huawei Enjoy 70 Pro స్మార్ట్ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచ్ అయ్యే అవకాశాలు లేవు. అటువంటి అవకాశం ఉంటే హువావే సంస్థ నుంచి అధికార ప్రకటన వస్తుంది. ఇప్పటి వరకు హువావే నుంచి ఇండియా లాంచ్ కి సంబంధించిన సంకేతాలు ఏమీ లేవు.
