హైలైట్స్
- రూ.1 లక్ష టోకెన్ అమౌంట్ చెల్లించి హ్యాందాయ్ కంపెనీ వెబ్ సైట్ నుంచి Hyundai Ioniq 5 ని బుక్ చేసుకునే అవకాశం
- ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం సింగిల్ చార్జ్ పై 631 కిలోమీటర్ల దూరం వెళ్ళనున్న Hyundai Ioniq 5
- కేవలం 18 నిమిషాల్లో 80 శాతం చార్జ్ కానున్న Hyundai Ioniq 5 కారు బ్యాటరీ
భారతీయ ఎలక్ట్రిక్ మార్కెట్ లో హ్యుందాయ్ కంపెనీ ప్రభంజనం సృష్టిస్తోంది. Auto Expo 2023 లో Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఈ కారు 631 కిలోమీటర్ల రేంజ్ తో వచ్చింది. ఈ ఈవెంట్ లో తన లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు ధరను కంపెనీ వెల్లడించింది. ఈ కారు యొక్క బుకింగ్ కూడా లాంచ్ కి ముందే ప్రారంభమైంది. బుకింగ్ కోసం కస్టమర్లు రూ.1 లక్ష చెల్లించాల్సి ఉంటుంది. సరే ఓసారి Hyundai Ioniq 5 కారు యొక్క స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం.
Hyundai Ioniq 5 ధర
Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారుని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ Auto Expo 2023 ఈవెంట్ లో లాంచ్ చేశారు. లాంచ్ సమయంలోనే కంపెనీ ఈ కారు యొక్క ధరలను ప్రకటించింది. Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ.44.95 లక్షలుగా ఉంది. అయితే ఈ ఇంట్రడక్టరీ ధరతో కేవలం మొదటి 500 మంది కస్టమర్లు మాత్రమే కారుని బుక్ చేసుకోవచ్చు. తర్వాత ధర పెరగనుంది.
Hyundai Ioniq 5 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారుని హ్యాందాయ్ కంపెనీ ఈ-జీఎంపి ప్లాట్ఫామ్ పై తయారు చేసింది. పంప్-టు-ప్లగ్ రెవొల్యూషన్ ఈ కారుతో మొదలు కానుంది. స్పెషల్ ఫీచర్ క్రింద, Hyundai Ioniq 5 కారులో 21 హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ (లెవెల్ 2 ఏడీఏఎస్) ని అందించారు.
Hyundai Ioniq 5 ఈవీ 4,635 మిల్లీ మీటర్ల పొడవు, 1,890 మిల్లీ మీటర్ల వెడల్పు, 1,625 మిల్లీ మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ మోడల్ యొక్క వీల్ బేస్ 3,000 ఎంఎం గా ఉంటుంది. మ్యాట్ గ్రావిటీ గోల్డ్, ఆప్టిక్ వైట్ మరియు మిడ్నైట్ బ్లాక్ పర్ల్ కలర్ ఆప్షన్స్ తో ఈ కారు లభిస్తుంది. భద్రత ఫీచర్లలో భాగంగా, Hyundai Ioniq 5 కారులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, వీఈఎస్ఎస్, ఈపీబీ, ఎంసీబీ, 4 డిస్క్ బ్రేక్స్ అందిస్తున్నారు.
Hyundai Ioniq 5 లో పారామెట్రిక్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, ఇంటెగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్స్, 20-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, ఇంటెగ్రేటెడ్ స్పాయిలర్ మరియు రేక్డ్ రియర్ విండ్ షీల్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
18 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్
Hyundai Ioniq 5 కారులో 72.6 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది 214 బీహెచ్‌పీ మరియు 350 నానోమీటర్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం, ఈ కారులో ఏఆర్ఏఐ-సర్టిఫకేషన్ రేంజ్ 631 కిలోమీటర్ల దూరం సింగిల్ చార్జ్ పై వెళ్తుంది. 350 కిలోవాట్ డీసీ చార్జర్ ద్వారా కారుని 10 శాతం నుంచి 80 శాతానికి కేవలం 18 నిమిషాల్లో చార్జ్ చేయవచ్చు.
Hyundai Ioniq 5 కారులో 12.3-ఇంచ్ సైజు కల్గిన రెండు భారీ స్క్రీన్స్ ని అందించారు. వీటిలో ఒక స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ కోసం కాగా, మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఇవ్వబడింది. ఇతర ఫీచర్లను చూస్తే, ఈ కారులో 8-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పవర్డ్ టెయిల్ గేట్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు వైర్లెస్ చార్జింగ్ ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.