హైలైట్స్
- భారత్ లో తన రెండవ ఎలక్ట్రిక్ కారు Hyundai Ioniq 5 ని లాంచ్ చేసిన హ్యుందాయ్ సంస్థ
- ఇప్పటికే భారత్ లో కోనా అనే ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసిన హ్యుందాయ్ కంపెనీ
- భారత్ లో మొదలైన Hyundai Ioniq 5 బుకింగ్స్

ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ భారత్ లో Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారుని లాంచ్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కస్టమర్లు టోకెన్ అమౌంట్ రూ.1 లక్ష చెల్లించి కారుని బుక్ చేసుకోవచ్చు.
Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్ఫామ్ (E-GMP) పై తయారైంది. ఈ కారు 4,635 మిల్లీ మీటర్ల పొడవు, 1,890 మిల్లీ మీటర్ల వెడల్పు, 1,625 మిల్లీ మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ కారు 3,000 మిల్లీ మీటర్ల వీల్ బేస్ కలిగి ఉంది.
Hyundai Ioniq 5 డిజైన్, ఫీచర్స్
Hyundai Ioniq 5 ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో ఎక్స్‌టీరియర్ పై ఆంగ్యులర్ సర్ఫేసెస్ తో కూడి ఉంది. డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, పిక్సెలేటెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, యూనిక్ డ్యూయల్-టోన్ అల్లాయ్స్ ఈ కారులో ఉన్నాయి. మినిమలిస్టిక్ ఇంటీరియర్ తో వచ్చిన ఈ కారులో డ్యూయల్ ఫ్లోటింగ్ స్క్రీన్, 2-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.
గ్లోబల్ గా Hyundai Ioniq 5 రెండు బ్యాటరీ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 58 కిలోవాట్ అవర్ మరియు 72.6 కిలోవాట్ అవర్. 480 కిలోమీటర్ల వరకు రేంజ్ ని ఈ కారు ఆఫర్ చేస్తుంది. బేస్ వర్షన్ సింగిల్ ఎలక్ట్రిక్ మోటర్ తో వస్తోంది. ఇది 165 బీహెచ్పీ పవర్ మరియు 350 ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. డ్యూయల్ మోటర్ వర్షన్ 298 బీహెచ్పీ పవర్ మరియు 605 ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 0 నుంచి 100 కేఎంపీహెచ్ వేగాన్ని కేవలం 5.2 సెకన్లలో చేరుకుంటుందని కంపెనీ చెబుతోంది.
భారత్ లో హ్యాందాయ్ భారీ బ్యాటరీ ప్యాక్ ని ఆఫర్ చేస్తోంది. ఇది 631 కి.మీ ఏఆర్ఏఐ సర్టిఫైడ్ రేంజ్ ని ఇస్తుది. ఎలక్ట్రిక్ మోటర్ కారుకి వెనకాల (రియర్ మౌంటెడ్) అమర్చబడింది. Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారు 800 వోల్టుల ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ చార్జర్ తో బ్యాటరీ 10 నుంచి 80 శాతానికి కేవలం 18 నిమిషాల్లో చార్జ్ అవుతుంది.
Hyundai Ioniq 5 లో 12.3-ఇంచ్ డిజిటల్ క్లస్టర్ మరియు ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, బోస్ సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్స్, డ్యూయల్-జోన్ క్లైమాటిక్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే, Hyundai Ioniq 5 లో 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, ఈబీడీ, ఇంజిన్ పార్కింగ్ బ్రేక్, ఫోర్ డిస్క్ బ్రేక్స్ వంటివి ఉన్నాయి. ఇక ఈ కారులో 571 లీటర్ల బూట్ స్పేస్ అందుబాటులో ఉంది.
Hyundai Ioniq 5 ఎలక్ట్రిక్ కారు Kia EV6, Mercedes-Benz EQB లతో పోటీ పడనుంది. Hyundai Ioniq 5 కారు మొత్తం 3 కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: గ్రావిటీ గోల్డ్ మ్యాట్, ఆప్టిక్ వైట్, మిడ్నైట్ బ్లాక్ పర్ల్.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.