Home News త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న కొత్తతరం Hyundai Kona Electric SUV

త్వరలో ఎంట్రీ ఇవ్వనున్న కొత్తతరం Hyundai Kona Electric SUV

హైలైట్స్:

కొత్త తరం కోన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పై ప్రస్తుతం హ్యుందాయ్ కంపెనీ పని చేస్తోంది. ఇటీవలె కంపెనీ ఈ కారుని రోడ్లపై పరీక్షించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ జనరల్ ఆర్కిటెక్చర్ పై తయారుకాబడింది. ఇది ఐసీఈ వర్షన్ లో కూడా అందుబాటులో ఉంది. ఇక హ్యుందాయ్ కోన భారత్ లో కేవలం ఎలక్ట్రిక్ వర్షన్ లో మాత్రమే అమ్ముడు కానుంది. భవిష్యత్తులో కూడా ఇందులో ఏ మార్పు ఉండబోదు.

భారత్ లో హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ రూ.25 లక్షల లోపు ప్రైస్ బ్రాకెట్ లో ఉండనుంది. కొత్తగా లాంచ్ అయిన టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ తో ఇది పోటీ పడనుంది. భారత్ లో ప్రస్తుతం కోన ఎలక్ట్రిక్ ప్రీ-ఫేస్ లిఫ్ట్ మోడల్ అమ్ముడవుతోంది. గ్లోబల్ మార్కెట్స్ లో ఇప్పటికే అమ్ముడవుతోన్న కోన ఈవీ ఫేస్ లిఫ్టెడ్ వర్షన్ ని హ్యుందాయ్ త్వరలో భారత మార్కెట్ లోకి తీసుకొచ్చే అవకాశముంది.

Hyundai Kona EV లాంచ్, ధర

నెక్ట్స్ జనరేషన్ హ్యుందాయ్ కోన కారుని కంపెనీ మారు అవతారంలో రోడ్లపై టెస్ట్ చేసింది. దీంతో ఎక్స్‌టీరియర్ డిజైన్ కి సంబంధించిన వివరాలు పెద్దగా తెలియలేదు. జర్మనీ లోని హ్యుందాయ్-కియా టెక్నికల్ సెంటర్ వద్ద టెస్ట్ మ్యూల్స్ (ఫస్ట్ ప్రోటోటైప్స్) కనిపించాయి. ఇతర హ్యుందాయ్ ఐసీఈ-పవర్డ్ వెహికిల్స్ మాదిరే హ్యాందాయ్ కోన ఎలక్ట్రిక్ కనిపించింది. 2024 లో ఈ బండి గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, కోన ఎలక్ట్రిక్ ఇండియా లాంచ్ పై ఇంకా క్లారిటీ లేదు.

ప్రస్తుత తరం హ్యాందాయ్ కోన ఈవీ రెండు వేరియంట్లలో లభిస్తోంది. అవి ఒకటి సింగిల్ టోన్ కలర్ వేరియంట్ కాగా, రెండోది డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్. వీటి ధరలు వరుసగా రూ.23.8 లక్షలు మరియు రూ.24 లక్షలు(ఇవి ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు).

అయితే, నిశితంగా గమనిస్తే, ఎలక్ట్రిక్ మోడల్ లో కొన్ని తేడాలను గమనించవచ్చు. ప్రస్తుత జనరేషన్ మోడల్ లాగే కారు యొక్క ముఖభాగం ఓపెన్ అయ్యుంది. ఇది చార్జింగ్ పోర్ట్ కోసమని తెలుస్తోంది. ఫ్రంట్ ఫాసియా కూడా ఎటువంటి ఓపెనింగ్స్ లేకుండా ఉన్నట్లు అనిపిస్తోంది. ఇది దాదాపు అన్ని ఎలక్ట్రిక్ కార్ల యొక్క లక్షణమని చెప్పవచ్చు. ఎందుకంటే ముందు భాగంలో కూలింగ్ అవసరమయ్యే ఇంజిన్ లేదు. అయితే బ్రేక్స్ తో పాటు ఇతర పరికరాలను చల్లబరిచేందుకు చిన్న నాళాల వంటివి ఉండే అవకాశముంది.

Hyundai Kona EV ఫీచర్స్ (అంచనా)

ప్రస్తుత డిజైన్ లాంగ్వేజీనే హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ ఫాలో కానుంది. అతి చిన్న డిజైన్ డీటెయిల్స్ తో కూడిన రాడికల్ డిజైన్ ను ఈ కొత్త తరం కారు కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముందువైపు లైటింగ్ లో భాగంగా ఒక లైట్ బార్ ఉండే అవకాశముంది. అలాగే, స్టార్ గేజర్ ఎంపీవీ మాదిరి, ట్రేప్‌జోయిడల్ మెయిన్ హెడ్ ల్యాంప్ యూనిట్ బంపర్ పైన ఉండే చాన్స్ ఉంది.

కియా నీరో ఈవీ ఎస్‌యూవీ లో ఉన్నట్లుగా.. 65 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ తో కూడిన 200 బీహెచ్‌పీ మోటార్ ని హ్యుందాయ్ కోన ఈవీ లో అమర్చే అవకాశముంది. ఇక టాప్-ఎండ్ వేరియంట్స్ లో కోన ఎలక్ట్రిక్ 400 కిలోమీటర్ల రేంజ్ ని కలిగి ఉంటుంది. ఇక లోయర్ వేరియంట్స్ కి చిన్న బ్యాటరీ ప్యాక్స్ ని హ్యుందాయ్ అమర్చే అవకాశముంది.

లేటెస్ట్ ఆటోమొబైల్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ని ఫాలో అవ్వండి.