హైలైట్స్
- USB Type-C ని అన్ని స్మార్ట్ డివైజెస్ కి ప్రామాణిక చార్జింగ్ పోర్ట్ గా వాడాలని ప్లాన్ చేస్తున్న భారత్
- అన్ని స్మార్ట్ ఫోన్స్ కి ఒకే విధమైన చార్జర్, ఫీచర్ ఫోన్స్ కి మరొక చార్జర్ – అంటే కేవలం రెండు చార్జర్ లను పరిగణలోకి తీసుకునే దిశగా పడుతోన్న అడుగులు
- ఫోన్ మారిన ప్రతీసారి చార్జర్ మార్చాల్సిన అవసరం లేకుండా యూజర్లకు ఉపయోగపడనున్న యూనివర్శల్ చార్జర్ లు
ఎన్నో దేశాలు వన్ నేషన్, వన్ చార్జర్ పాలసీని అమలు చేసే దిశగా అడుగు వేస్తున్నాయి. దీని ప్రకారం, అన్ని స్మార్ట్ డివైజెస్.. అంటే మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, కెమెరాలకు ఒకే రకమైన చార్జర్ ఉండనుంది. స్మార్ట్ ఫోన్స్ ని చార్జ్ చేసేందుకు USB Type-C ని స్టాండర్డ్ పోర్ట్ గా వినియోగించాలని భారత్ ప్లాన్ చేస్తోంది.
ఇంటర్-మినిస్ట్రియల్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో అన్ని స్మార్ట్ డివైజెస్ కి USB Type-C చార్జింగ్ పోర్ట్ ని వాడేందుకు అందరు స్టేక్‌హోల్డర్స్ అంగీకరించినట్లు కన్జూమర్ అఫైర్స్ కేంద్ర సెక్రటరీ రోహిత్ కుమార్ వెల్లడించారు.
ఫీచర్ ఫోన్లకు ఒక రకమైన చార్జర్, స్మార్ట్ ఫోన్లకు మరొకమైన చార్జర్ ఉంటే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. యురోపియన్ యూనియన్ ఇటీవలె చేసి చట్టానికి ఇది విభిన్నం. అన్నింటికీ టైప్-సీ ఉండేలా ఈయూ చట్టం తెచ్చింది. పైపైన మాటలే తప్పితే, ఫీచర్ ఫోన్లకు సంబంధించిన చార్జర్స్ గురించి ఇంకా ఏ కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు. స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్ విషయంలో కూడా ఏ చార్జింగ్ పోర్ట్ ఉండాలనే దానిపై ఓ ప్రత్యేక బృందం చర్చిస్తోంది.
ప్రస్తుతం ఒక ఆపిల్ తప్పితే మిగతా అన్ని ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ కూడా
యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ తోనే వస్తున్నాయి. యురోపియన్ కొత్త చట్టం తీసుకురావడంతో, ఆపిల్ తన తదుపరి లైనప్ ఐఫోన్ 15 సిరీస్ ని యూఎస్బీ టైప్-సీ తో లాంచ్ చేస్తున్నట్లు సమాచారం.
USB Type-C చార్జర్ ప్రయోజనాలు
USB Type-C కనెక్షన్ ద్వారా డివైజెస్ సాధారణ యూఎస్బీ కంటే త్వరగా చార్జ్ అవుతయాయి. ల్యాప్ టాప్స్, ట్యాబ్స్ తదితర డివైజెస్ ని చార్జ్ చేసేందుకు టైప్-సీ ఉపయోగపడుతుంది. 100 వాట్స్ వరకు పవర్ సప్లై చేసే ఫాస్ట్ చార్జింగ్ ప్రోటోకాల్ USB Power Delivery కి యూఎస్బీ టైప్ సీ కనెక్షన్స్ సపోర్ట్ చేస్తాయి.
భారత్ లో E-Waste ని తగ్గించేందుకు సాయపడనున్న USB Type-C చార్జర్స్
వినియోగదారులు ఎల్లప్పుడూ ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ ని మారుస్తుండటం వల్లన దేశంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. అసోచామ్-ఈవై రిపోర్ట్ ప్రకారం, గతేడాది భారత్ లో 5 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. దీంతో యూఎస్, చైనా తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. అందుచేత, యూనివర్శల్ చార్జర్స్ ఉంటే కొత్త డివైజ్ కొన్న ప్రతిసారి కస్టమర్లు డిఫరెంట్ చార్జర్ ని కొనాల్సిన అవసరం ఉండదు. దీంతో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించినట్లవుతుంది.
2024 ద్వితీయార్థం ఆరంభమయ్యే నాటికల్లా యురోపియన్ యూనియన్ (ఐరోపా దేశాలు) లో అమ్ముడయ్యే ఏ స్మార్ట్ ఫోన్ అయినా, (ఆపిల్ ఐఫోన్ తో సహా) వైర్డ్ చార్జింగ్ కోసం కచ్చితంగా యూనివర్శల్ USB-C కనెక్టర్ ని కలిగి ఉండాలని ఈ ఏడాది జూన్ 7 న యురోపియన్ యూనియన్ ఒక ప్రిలిమినరీ చట్టాన్ని తీసుకొచ్చింది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.