హైలైట్స్
- తక్కువ ధరలో 5జీ ఫోన్లను తీసుకొస్తోన్న Infinix సంస్థ
- ఇటీవలె గ్లోబల్ గా లాంచ్ అయిన Infinix Hot 20 సిరీస్
- త్వరలో భారత్ లో అడుగుపెట్టనున్న Infinix Hot 20 సిరీస్
Infinix సంస్థ త్వరలో Infinix Hot 20 సిరీస్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలె Infinix Hot 20 సిరీస్ ని సదరు సంస్థ గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ చేసింది. తాజాగా ఇండియా లాంచ్ కి సంబంధించిన విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఇన్ఫినిక్స్ టీజ్ చేసింది. Infinix Hot 20 సిరీస్ లో Infinix Hot 20 Play, Infinix Hot 20i, Infinix Hot 20, Infinix Hot 20s, Infinix Hot 20 5G అనే మోడల్స్ ఉంటాయి. అయితే ఈ మోడల్స్ అన్నీ భారత్ లోకి ప్రవేశిస్తాయా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
అయితే కంపెనీ చేసిన ట్వీట్ లో దాగి ఉన్న హింట్ ప్రకారం, Infinix Hot 20 5జీ ఫోన్ లాంచ్ అవుతుందని తెలుస్తోంది. అలాగే శుద్ధ్5జీ అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా తన ట్వీట్ కి జత చేసింది.
And the cat's out of the bag! ?
Get ready to experience the HOTNESS of the all new Infinix HOT 20 Series, with features that will make you go #AbAurKyaChahiye ?
The amazing HOT 20 Series is launching super soon, stay tuned!#Shuddh5G pic.twitter.com/mEPOqqWGzR
— Infinix India (@InfinixIndia) November 11, 2022
Infinix Hot 20 5G స్పెసిఫికేషన్స్
Infinix Hot 20 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ని కలిగి ఉంటుంది.
Infinix Hot 20 5G ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ కలిగి ఉంటుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ 5 వాట్ రివర్స్ చార్జింగ్ ఫీచర్ తో వస్తోంది.
భద్రత కోసం Infinix Hot 20 5G లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ సిమ్, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.
ఇప్పుడు Infinix Hot 20 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఇందులో 50 మెగా పిక్సెల్ శాంసంగ్ జెఎన్1 సెన్సర్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరాలో ఐ ట్రాకింగ్, పొట్రెయిట్ మోడ్, షార్ట్ వీడియో మోడ్, సూపర్ నైట్ మోడ్ ఉంటాయి.
Infinix Hot 20 5G 166.25 మిల్లీ మీటర్ల పొడవు, 76.45 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.93 మిల్లీ మీటర్ల మందం, 204 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ రేసింగ్ బ్లాక్, స్పేస్ బ్లూ, బ్లాస్టర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Infinix Hot 20 5G స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర 180 యూరోలు (సుమారు రూ.14,500). భారతీయ మార్కెట్ లో ఫోన్ ధర రూ.15,000 లోపే పెట్టే అవకాశం ఉంది.
Infinix Hot 20 Play స్పెసిఫికేషన్స్
Infinix Hot 20 Play స్మార్ట్ ఫోన్ 6.82-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్ వినియోగించారు. ఇదొక ఆక్టాకోర్ ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ ని వాడారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Infinix Hot 20 Play లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13 ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెన్సర్, 8ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. చార్జింగ్ కోసం టైప్ సీ పోర్ట్ అందించారు. ఈ ఫోన్ లో రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ ఫోన్ 171.0 మిల్లీ మీటర్ల పొడవు, 78.0 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.85 మిల్లీ మీటర్ల మందం, 209.6 గ్రాముల బరువు ఉంటుంది.
Infinix Hot 20 Play రేసింగ్ బ్లాక్, లునా బ్లూ, అరోరా గ్రీన్, ఫాంటసీ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.